చిరు తో జత కట్టనున్న చెన్నై బ్యూటీ

చిరు తో జత కట్టనున్న చెన్నై బ్యూటీ

సైరా నరసింహారెడ్డితో మరో బిగ్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను లాంచనంగా ప్రారంభించాడు చిరు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది.

కోలీవుడ్‌లో ఇంట్రస్టింగ్‌ సినిమాలతో ఆకట్టుకుంటున్న క్రేజీ బ్యూటీ త్రిష ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నటించనుంది. గతంలో వీరిద్దరు స్టాలిన్‌ సినిమాలో కలిసి నటించారు. మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2006లో రిలీజ్‌ అయ్యింది. ఇప్పుడు 13 ఏళ్ల తరువాత ఈ కాంబినేషన్‌ మళ్లీ రిపీట్ అవుతోంది.

మహేష్ బాబు హీరోగా భరత్‌ అనే నేను సినిమా తెరకెక్కించిన కొరటాల శివ తరువాత చిరు సినిమా కోసం లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్నాడు. చాలా రోజుల స్క్రిప్ట్ వర్క్‌ తరువాత ఇటీవలే సినిమాను ప్రారంభించాడు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాను కూడా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నాడు.