రన్ మెషిన్ బర్త్ డే

రన్ మెషిన్ బర్త్ డే

విరాట్ కోహ్లి  భారతదేశపు అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. మలేసియా లో జరిగిన అండర్19 ప్రపంచ కప్ క్రికెట్లో భారత జట్టుకి అతను సారథ్యం వహించాడు. ఢిల్లీ జట్టుకు ఫస్ట్ క్లాసు క్రికెట్‌లో కోహ్లీ ప్రాతినిధ్యం వహించాడు. రాయల్స్ చాలెంజెర్స్ బెంగుళూరు తరఫున ఐపిఎల్లోను ఆడాడు. బ్యాట్స్మన్ కొరకు ICC ODI రాంకింగ్లలో 873 పాయింట్లతో కోహ్లి మొదటి స్థానంలో ఉన్నాడు.

మిడిల్ ఆర్డర్ బాట్స్మన్ గా కోహ్లిఇంకా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గా ఆడగల కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈరోజు 31వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఢిల్లీలో నవంబరు 5,1988న జన్మించిన కోహ్లీ 2008లో టీమిండియాలోకి అరంగేట్రం చేశాడు తిరుగులేని బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందిన విరాట్ ఆస్ట్రేలియాలో జరిగిన ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్లో వందపరుగులు సాధించిన తర్వాత జట్టుకు ఎంపికయ్యాడు. ప్రత్యర్థి బౌలర్ల నుంచి సవాళ్ళు ఎదురైతే మరింతగా ఉత్సాహంగా ఆడుతాడు.

దశాబ్దకాలంగా టీమిండియా తరఫున క్రికెట్ ఆడుతున్న కోహ్లీ వన్డేల్లో43, టెస్టుల్లో 26శతకాలు సాదించాడు. బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా భారత కెప్టెన్‌గా కూడా కోహ్లీ ముందుస్థానంలో కొనసాగుతున్నాడు. అత్యధిక విజయాల్ని టీమిండియాకి టెస్టుల్లో అందించిన కెప్టెన్‌గా కోహ్లీ ఉన్నాడు.అంతే కాకుండా వన్డే, టీ20ల్లోనూ భారత జట్టుని ముందుండి నడిపిస్తున్నాడు. ఫిట్‌నెస్, కెప్టెన్సీ ఇలా అన్ని విషయాల్లోనూ ముందు ఉంటూ మంచి ఆటగాడిగా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు.