స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ పెళ్లి

స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ పెళ్లి

స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ ఉత్తమమైన క్రీడాకారులలో ఒకడిగా  అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ATP) లో మొదటి స్థానంలో ఉన్నాడు. “ది కింగ్ ఆఫ్ క్లే” అని పిలువబడే రాఫెల్‌ నాదల్‌ ప్రస్తుతం టెన్నిస్‌ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్నాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ తో అగ్రస్థానంలో ఉన్న స్విట్జర్లాండ్‌ స్టార్‌ రోజర్‌ ఫెడరర్‌తో 19 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ తో పురుషుల విభాగంలో పోటీ పడబోనున్నాడు.

33 ఏళ్ల రాఫెల్‌ నాదల్‌ 14 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న ప్రేయసి జిస్కా పరెల్లో ని వివాహమాడి ఒక ఇంటివాడు అయ్యాడు. రాఫెల్‌ నాదల్‌ సోదరి మరిబెల్‌కు చిన్ననాటి స్నేహితురాలు జిస్కా పరెల్లో అని సమాచారం.