శ్రీలంకతో జరిగే మ్యాచులకు హెడ్‌ కోచ్‌గా ద్రవిడ్‌

శ్రీలంకతో జరిగే మ్యాచులకు హెడ్‌ కోచ్‌గా ద్రవిడ్‌

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌, ఇంగ్లండ్‌ పర్యటన లో భాగంగా బీసీసీఐ తుది జట్టును కొన్ని రోజుల కింద ప్రకటించిన విషయం తెలిసిందే. వీటితో పాటుగా శ్రీలంక పర్యటన కోసం మరో టీంను బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ప్రకటించారు. భారత జట్టు ఇంగ్లండ్‌ పర్యటనలో ఉండగానే మరోక వన్డే జట్టును శ్రీలంక పర్యటనకు పంపనుంది. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు విరాట్‌కోహ్లి సారథ్యంలో టీమిండియా ఈ నెల 29 న ఇంగ్లండ్‌కు పయనమవనున్నారు.

ఇక న్యూజిలాండ్‌తో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ ముగిసిన నెల తరువాత ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ప్రారంభంకానుంది. ఈ సమయంలోనే టీమిండియా శ్రీలంక పర్యటన చేయనుంది. ఈ నేపథ్యంలో భారత వన్డే జట్టుకు కోచ్‌ రవిశాస్త్రి అందుబాటులో ఉండడు. దీంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలంకతో జరిగే మ్యాచులకు రాహుల్‌ ద్రవిడ్‌ను హెడ్‌ కోచ్‌గా పంపాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. వీరితో పాటుగా నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఎ)కు సంబంధించిన సిబ్బంది కూడా శ్రీలంక టూర్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.