రాహుల్ సిప్లిగంజ్ పై గచ్చిబౌలిలోని పబ్ లో దాడి

రాహుల్ సిప్లిగంజ్ పై గచ్చిబౌలిలోని పబ్ లో దాడి

బిగ్ బాస్ విజేతగా నిలిచి ఒక్కసారి సెలబ్రిటీ స్టేటస్ సొంతం చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్ పై గచ్చిబౌలిలోని ఒక పబ్ లో దాడి జరిగింది. తనతో పాటు వచ్చిన స్నేహితురాలి పట్ల అక్కడి వారు అనుచితంగా వ్యవహరించటం.. ఈ సందర్భంగా మాటా మాటా పెరిగి చివరకు పరస్పర దాడులకు పాల్పడినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో రాహుల్ ను ఒకరిద్దరు పట్టుకుంటే.. మరొకరు బీరు బాటిల్ ను నెత్తి మీద పగలగొట్టేశారు.

దీంతో గాయాలపాలైన రాహుల్ ను ఆసుపత్రికి తరలించారు. సరైన సమయంలో పోలీసులు ఎంట్రీ ఇవ్వటం.. ఇరు వర్గాల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా.. అప్పటికే గొడవ ముదిరిపోయినట్లుగా చెబుతున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా రాహుల్ తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేయలేదంటున్నారు. అయితే.. మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ ఈ వీడియో వైరల్ గా మారటంతో పోలీసులు సుమోటోగా తీసుకొని కేసును రిజిస్టర్ చేశారు.