మహేష్‌తో శివాని కూడా..!

Rajasekhar Daughter Shivani turns as Brand ambassador

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
స్టార్‌ హీరోలు మరియు హీరోయిన్స్‌ పెద్ద కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించాలని కోరుకుంటారు. స్టార్‌ హీరోలకు మాత్రమే బడా కంపెనీలకు అంబాసిడర్‌గా వ్యవహరించే అవకాశం దక్కుతుంది. కాని తాజాగా రాజశేఖర్‌ కూతురు శివానికి మాత్రం ఒక్క సినిమా కూడా చేయకుండానే ప్రముఖ కూల్‌డ్రింగ్ కంపెనీ కోకకోలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించే అవకాశం దక్కింది. తెలుగులో గత కొంత కాలంగా మహేష్‌బాబు థమ్సప్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా మహేష్‌బాబుతో పాటు శివాని కూడా యాడ్స్‌లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

గత రెండు మూడు సంవత్సరాలుగా శివాని హీరోయిన్‌గా నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు బాలీవుడ్‌ చిత్రం ‘2స్టేట్స్‌’ రీమేక్‌లో శివాని నటించబోతుంది. ఇటీవలే రాజమౌళి చేతుల మీదుగా ‘2స్టేట్స్‌’ రీమేక్‌ ప్రారంభం అయ్యింది. అడవి శేషు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శివాని హీరోయిన్‌గా నటిస్తుంది. ఒక్క సినిమా కూడా చేయకుండానే శివానికి తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ ఉంది. ఆమె తండ్రి రాజశేఖర్‌ స్టార్‌ హీరో అవ్వడం వల్ల ఆమెకు బై బర్త్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ క్రియేట్‌ అయ్యింది. అందుకే ఆమెను కోకకోల కంపెనీ వారు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒక తెలుగు అమ్మాయి కోలా కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక అవ్వడం ఇదే ప్రథమం.