వారికి ఏమాత్రం తీసిపోదట!

Shivani glamorous Role in Telugu Remake of 2 States

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్స్‌ చాలా తక్కువ. ఎక్కువగా ముంబయి ముద్దుగుమ్మలు లేదా మలయాళి ముద్దుగుమ్మలు ఉంటారనే విషయం తెల్సిందే. తెలుగు అమ్మాయిలను హీరోయిన్స్‌గా తీసుకుంటే వారు అందాలను ఆరబోయరు అనే ఉద్దేశ్యంతో ఎక్కువ శాతం దర్శక నిర్మాతలు తెలుగు హీరోయిన్స్‌పై ఆసక్తి చూపించరు. ఇక స్టార్స్‌ వారసులతో గ్లామర్‌ రోల్స్‌ చేయించేందుకు ఏ నిర్మాత మరియు దర్శకుడు కూడా ధైర్యం చేయడు. టాలీవుడ్‌లో నిహారిక, మంచు లక్ష్మిలు స్టార్స్‌ వారసులుగా ఎంట్రీ ఇచ్చారు. వారు మినిమం గ్లామర్‌గా కూడా కనిపించరు. దర్శకులు వారిని అలా చూపించేందుకు ఆసక్తి చూపించరు. కాని రాజశేఖర్‌ కూతురు శివాని మాత్రం గ్లామర్‌ రోల్స్‌ ఎక్కువ చేస్తానంటోంది.

రెండు మూడు సంవత్సరాలుగా శివాని హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు టూ స్టేట్స్‌ చిత్రం రీమేక్‌ను శివాని చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. రాజశేఖర్‌ నట వారసురాలు అవ్వడంతో శివాని పద్దతిగా, హుందాగా, గ్లామర్‌ పాత్రలకు దూరంగా నటించబోతున్నట్లుగా అంతా భావించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శివాని నటిస్తున్న మొదటి సినిమాలోనే తన అందాల విశ్వరూపంను చూపించాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఫుల్‌గా స్కిన్‌ షోకు కూడా ఈ అమ్మడు సిద్దం అయ్యింది. బాలీవుడ్‌ హీరోయిన్స్‌కు, ముంబయి ముద్దుగుమ్మలకు ఏమాత్రం తీసిపోకుండా తాను కూడా ప్రస్తుతం చేస్తున్న, త్వరలో చేయబోతున్న సినిమాల్లో స్కిన్‌ షోకు సిద్దం అని, శృతిమించని గ్లామర్‌ షో కాకుండా అందాల ప్రదర్శణకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పింది. అడవి శేషు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శివాని నటనతో పాటు ఆమె అందాలు కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.