ఆర్‌ఆర్‌ఆర్‌లో రాజశేఖర్‌, కాని..!

Rajasekhar In The RRR But The Important Role

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కబోతున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రంలో రాజశేఖర్‌ నటించబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. సోషల్‌ మీడియాలో మల్టీస్టారర్‌ మూవీలో రాజశేఖర్‌ విలన్‌గా ఎంపిక అయ్యాడు అని, రాజమౌళి ఏరి కోరి మరీ రాజశేఖర్‌ను విలన్‌ పాత్రకు ఎంపిక చేశాడని ప్రచారం చేస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మల్టీస్టారర్‌ మూవీలో రాజశేఖర్‌ నటించబోతున్న మాట వాస్తవమే కాని విన్‌గా మాత్రం కాదని, ఒక ముఖ్య పాత్రకు రాజశేఖర్‌ను రాజమౌళి పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

‘బాహుబలి’ చిత్రంలో కట్టప్ప పాత్రకు ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో అంతటి ప్రాముఖ్యత ఉన్న ఒక పాత్ర మల్టీస్టారర్‌ మూవీలో కూడా ఉంటుందట. ఆ పాత్రను రాజశేఖర్‌తో చేయిస్తే బాగుంటుందనే అభిప్రాయం రాజమౌళిలో ఉందని, అందుకే జక్కన్న రాజశేఖర్‌ను సంప్రదించాడు అంటూ సమాచారం అందుతుంది. రాజమౌళి వంటి స్టార్‌ దర్శకుడి దర్శకత్వంలో ఎలాంటి పాత్ర అయినా నటించేందుకు ఎంత పెద్ద స్టార్‌ అయినా ఓకే చెప్పాల్సిందే. అందుకే రాజశేఖర్‌ కూడా మల్టీస్టారర్‌లో ముఖ్య పాత్రను పోషించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఈ మల్టీస్టారర్‌ చిత్రంలో విలన్‌ ఎవరు అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.