త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌.. సినిమా కాదు!

Trivikram Beings Shooting With NTR For IPL

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో త్వరలో ఒక చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే. ఇంకా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాని ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్‌ జరుపుకుంటున్న త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ల మూవీ పట్టాలెక్కేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. అయితే గత రెండు రోజులుగా ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌ కొన్ని సీన్స్‌కు షూటింగ్‌ చేస్తున్న స్టిల్స్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దాంతో అంతా కూడా వీరి కాంబో మూవీ పట్టాలెక్కిందని భావిస్తున్నారు. కాని అది సినిమా షూటింగ్‌ కాదని, యాడ్‌ షూటింగ్‌ అని తాజాగా తేలిపోయింది.

ఐపీఎల్‌కు ఎన్టీఆర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించబోతున్న విషయం తెల్సిందే. ఐపీఎల్‌ హక్కును దక్కించుకున్న స్టార్‌ ఛానెల్‌ తెలుగు వ్యాఖ్యనంతో ఐపీఎల్‌ను ప్రసారం చేయాలని భావిస్తుంది. అందుకే ఎక్కువ పబ్లిసిటీ కోసం ఎన్టీఆర్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక చేయడం, ఎన్టీఆర్‌తో యాడ్స్‌ను చిత్రీకరించడం జరుగుతుంది. ఎన్టీఆర్‌ యాడ్స్‌ను త్రివిక్రమ్‌తో తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి కాంబో మూవీకి ఇదో ఆరంభం అని సినీ వర్గాల వారు అంటున్నారు. ఎన్టీఆర్‌ పబ్లిసిటీతో ఐపీఎల్‌కు భారీ క్రేజ్‌ రావడం ఖాయం అని, తెలుగులో ఐపీఎల్‌ సూపర్‌ హిట్‌ అవుతుందనే నమ్మకంను స్టార్‌ మా వారు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ మూవీ పట్టాలెక్కేది ఎప్పుడు అనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.