‘రంగస్థలం’ యూఎస్‌ ప్రీమియర్‌ టాక్‌

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘రంగస్థలం’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత కొన్ని వారాలుగా టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వెల వెల బోయింది. రంగస్థలం రాకతో బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురుస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో మరియు ఇతర రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఈ చిత్రంను విడుదల చేయడం జరిగింది. ఏకంగా 1800 స్క్రీన్‌లలో ఈ చిత్రాన్ని నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. భారత కాలమానం ప్రకారం నేడు తెల్లవారు జామునే అమెరికాలో ప్రీమియర్‌ షోలు ప్రారంభం అయ్యాయి. దాంతో అక్కడ నుండి మొదటి టాక్‌ వస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుతుండగానే అమెరికా నుండి సోషల్‌ మీడియాలో రంగస్థలం రివ్యూలు వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో యూఎస్‌ టాక్‌ పాజిటివ్‌గా ఉంది. ఇలాంటి సినిమాను చేసినందుకు రామ్‌ చరణ్‌ మరియు సుకుమార్‌లను వారు అభినందిస్తున్నారు. రామ్‌ చరణ్‌ అద్బుతమైన నటనతో మెప్పించాడు. కెరీర్‌ బెస్ట్‌ యాక్టింగ్‌తో రామ్‌ చరణ్‌ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తున్నాడు అంటున్నారు. ఇక ఈ చిత్రం మొదటి సగం ఎంటర్‌టైన్‌మెంట్‌తో బాగుందని, సెకండ్‌ హాఫ్‌ విషయంలో కాస్త నిరాశను యూఎస్‌ ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే సినిమా బాగుందని చెబుతున్నారు. సమంత లుక్‌ మరియు ఆమె నటన కూడా సినిమాకు అదనపు ఆకర్షణ అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.