‘రంగస్థలం’లో మరో వివాదం …

Folk Singer Shiva Nagulu Fires On Devi Sri Prasad Rangasthalam Song

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

‘రంగస్థలం’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను రాబట్టడంతో సినిమా ఏ రేంజ్‌ విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రంగస్థలం చిత్రం విడుదలకు ముందు నుండి విడుదలైన తర్వాత కూడా వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒక పెద్ద సినిమాకు ఇలాంటి వివాదాలు, విమర్శలు చాలా కామన్‌ అని చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. సినిమా విడుదలకు ముందు గొల్లభామ అంటూ పాటలో పదం తమను అవమానిస్తుంది అంటూ గొల్ల కులం వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలో ఆ పదంను తొలగించి, గోరువంక అని పెట్టారు. 

సినిమా విడుదల తర్వాత 2010వ సంవత్సరంలో తాను ఈ కథను ఛాంబర్‌లో రిజిస్ట్రర్‌ చేయించాను అంటూ ఒక వ్యక్తి మీడియా ముందుకు వచ్చాడు. ఒకటి రెండు రోజులు హడావుడి చేసిన ఆ వ్యక్తి తర్వాత సైలెంట్‌ అయ్యాడు. తాజాగా ఈ చిత్రం కోసం పాట పాడిన ఒక గాయకుడు మీడియా ముందుకు వచ్చి తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్నికల సమయంలో వచ్చే ఆగట్టునుంటావా రాజన్న, ఈగట్టుకు వస్తావ రాజన్న అంటూ సాగే పాటను శివ నాగులు పాడాడు. ప్రీ రిలీజ్‌ వేడుకలో శివనాగులును వేదికపైకి పిల్చి మరీ దేవిశ్రీ ప్రసాద్‌ అభినందించాడు. ఆ పాటకు మంచి క్రేజ్‌ దక్కింది. అయితే సినిమాలో మాత్రం ఆ పాటను దేవిశ్రీ ప్రసాద్‌ గొంతుతో ఉంది. శివనాగులు తాను పాడిన లేకపోవడంతో అవాక్కయ్యాడు. విషయాన్ని దేవిశ్రీ దృష్టికి తీసుకు వెళ్లగా స్పందించలేదని తెలుస్తోంది. తనకు ఒక మాట చెప్తే బాగుండేదని, తనకు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా, అగౌరవ పర్చే విధంగా పాటను మార్చారు అంటూ శివనాగులు ఆవేదన వ్యక్తం చేశాడు.