‘రంగస్థలం’కు ఉమైర్‌ రివ్యూ

Umair Sandhu Review For Rangasthalam Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగా ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘రంగస్థలం’. సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీస్‌ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1750 థియేటర్లలో విడుదల కాబోతుంది. ఇంత భారీ స్థాయిలో విడుదల అవ్వబోతున్న ఈ చిత్రం రికార్డులు బ్రేక్‌ చేయడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు, ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. అదే విషయాన్ని ప్రముఖ సినీ జర్నలిస్ట్‌, ప్రతి పెద్ద సినిమాకు తన రివ్యూను ఇచ్చే ఉమైర్‌ సంధు కూడా చెప్పుకొచ్చాడు. 

స్టార్‌ హీరోల సినిమాలకు రేటింగ్‌లు ఇస్తూ, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న ఉమైర్‌ ‘రంగస్థలం’ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించాడు. రామ్‌ చరణ్‌ నటన మరియు సుకుమార్‌ దర్శకత్వం అద్బుతం అంటూ ఆయన రివ్యూ చెప్పాడు. ఈ సినిమాకు తాను 3.5/5.0 రేటింగ్‌ ఇస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అయితే ఈయన రివ్యూ ఇటీవల నమ్మశక్యంగా లేదు. గత సంవత్సరం విడుదలైన స్పైడర్‌ మరియు సంక్రాంతికి వచ్చిన ‘అజ్ఞాతవాసి’ చిత్రాలకు భారీ రేటింగ్‌ను ఇచ్చాడు. ఆ రెండు చిత్రాలు కూడా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయి. మరి ఈసారైనా ఉమైర్‌ సంధు రివ్యూ నిజమేనేమో చూడాలి. భారీ హిట్‌ అయిన చిత్రానికి ఉమైర్‌ 4 నుండి 5 రేటింగ్‌ కూడా ఇస్తాడు. కాని రంగస్థలంకు 3.5 మాత్రమే ఇచ్చాడని కొందరు సోషల్‌ మీడియాలో చంకలు గుద్దుకుంటున్నారు. ఏది ఏమైనా రంగస్థలం చిత్రం ఎలా ఉంటుందా అని అంతా కూడా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు.