చరణ్‌ పరువు తీస్తున్నారుగా..సోషల్‌ మీడియాలో జోకులు

Fans Social Media Jokes On Ram Charan Acting In Rangasthalam Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన ‘రంగస్థలం’ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌ టాక్‌ను దక్కించుకుంది. ఇక ఈ చిత్రంపై ఇతర హీరోల ఫ్యాన్స్‌ కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇదే సమయంలో ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ కెరీర్‌ బెస్ట్‌ నటన కనబర్చాడు అంటూ సోషల్‌ మీడియాలో పలువురు అభినందిస్తున్నారు. ఇదే సమయంలో రామ్‌ చరణ్‌ ఇన్నాళ్లకు నటుడిగా నిరూపించుకున్నాడు అంటూ జోకులు పేలుతున్నాయి. కెరీర్‌ ఆరంభం నుండి ఇప్పటి వరకు చరణ్‌ ఏ ఒక్క సినిమాలో కూడా నటుడిగా ఆకట్టుకోలేక పోయాడు. ‘మగధీర’లో కాస్త పర్వాలేదు అనిపించినా, ఆ తర్వాత నటించిన సినిమాల్లో ఏ ఒక్కటి కూడా ఆయనకు నటుడిగా పేరు తీసుకు రాలేక పోయాయి అంటూ కొందరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. 

‘రంగస్థలం’ చిత్రంతో మెగాస్టార్‌ చిరంజీవి కొడుకు అనిపించుకున్నాడని, ఈ చిత్రం తర్వాత చిరంజీవి ఆనందిస్తాడని, తన కొడుకుకు కూడా నటన వచ్చని ఆయన భావిస్తున్నాడని జోకులు పోస్ట్‌ చేస్తున్నారు. రామ్‌ చరణ్‌ రంగస్థలంలో కనబర్చిన నటన మళ్లీ జీవితంలో ఏ చిత్రంలో కూడా కనబర్చలేక పోవచ్చు అని కొందరు అంటే, మరి కొందరు మాత్రం రామ్‌ చరణ్‌ ప్రతిభ ఇందులో ఏమీ  లేదని, అదంతా కూడా దర్శకుడు సుకుమార్‌ ప్రభావం అంటున్నారు. మొత్తానికి సోషల్‌ మీడియాలో రామ్‌ చరణ్‌ నటన గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ట్వీట్లు చేసేసుకుంటున్నారు.