ఇది నిజం అయితే సంచలనమే..!

Ram Charan , Junior NTR Guests For Bharat Ane Nenu Audio Function

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భరత్‌ అను నేను’ చిత్రం ఏప్రిల్‌ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతుంది. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంను హైదరాబాద్‌లో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆడియో వేడుక కోసం ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరు కూడా ఒక మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేసేందుకు సన్నాహాకాల్లో ఉన్న విషయం తెల్సిందే. ఇక వీరిద్దరికి దర్శకుడు కొరటాల శివ ఆప్తుడు. అందుకే భరత్‌ అను నేను చిత్రం ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరు అయ్యేందుకు సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. 

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలు అనగానే వెంటనే గుర్తుకు వచ్చే పేరు మహేష్‌బాబు, రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌. అలాంటి ఈ ముగ్గురు ఒకే స్టేజ్‌పై కనిపిస్తే అది టాలీవుడ్‌లో ఈ దాశాబ్దపు అతి పెద్ద సంఘటన అనొచ్చు. ఈ ముగ్గురు ఒకే వేదికపై కనిపిస్తే ఫ్యాన్స్‌కు, ప్రేక్షకులకు చూసేందుకు కన్నులు సరిపోవేమో. ఇదే కనుక నిజం అయితే ‘భరత్‌ అను నేను’ చిత్రం చరిత్రలో నిలిచి పోతుంది. ముగ్గురు స్టార్‌ హీరోలను ఒకే స్టేజ్‌పై కనిపించేలా చేసినందుకు దర్శకుడు కొరటాల శివకు తెలుగు సినిమా ప్రేక్షకులు అంతా కూడా కృతజ్ఞతలు చెప్పాలిందే. అయితే ఇది నిజం అయ్యేనా లేదా అనేది చూడాలి. మరో వారం రోజుల్లో ఆడియో విడుదలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.