కొరటాలకు ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్‌

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రచయితగా కెరీర్‌ను ఆరంభించిన కొరటాల శివ ‘మిర్చి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యి వరుసగా సూపర్‌ హిట్స్‌, బ్లాక్‌ బస్టర్స్‌ను దక్కించుకుంటూ వస్తున్న ఈయన తాజాగా ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఒక అద్బుతమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించి రికార్డు స్థాయి వసూళ్లను సాధించాడు. ఈ చిత్రం విజయం సాధించిన సందర్బంగా కొరటాల శివ మీడియాతో మాట్లాడుతూ తనకు ఒకప్పుడు ఎమ్మెల్యే కావాలని ఆశ ఉందని, కాని ఇప్పుడు అది లేదు అంటూ చెప్పుకొచ్చాడు. సినిమాలో మంచి చేయాలి, మంచి మార్పు రావాలని చూపించే కొరటాల శివ ఎమ్మెల్యే అయితే బాగుంటుందనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. 

ఎమ్మెల్యే కావాలనే కోరిక కొరటాలకు ఇప్పుడు కూడా ఉంటే తనకున్న క్రేజ్‌తో ఏపీలో ఖచ్చితంగా ఏ పార్టీ నుండైనా ఆయన సీటును సంపాదించుకోవచ్చు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అంటే టీడీపీ, వైకాపా పార్టీలు పిలిచి మరీ అవకాశం ఇవ్వడం ఖాయం. కాని కొరటాల శివకు ప్రస్తుతం ఆ ఆసక్తి లేదు. తెలుగు దేశం ఎంపీ అయిన గల్లా జయదేవ్‌ తన పలుకుబడి ఉపయోగించి కొరటాలకు ఎమ్మెల్యే సీటు ఇప్పించగల సత్తా ఉందని, అలాగే గెలిపించుకోగలిగిన సత్తా కూడా ఉందని అంటున్నారు. ఇప్పుడు ఆసక్తి లేకున్నా మళ్లీ కొరటాలకు ఎమ్మెల్యే అవ్వాలనే కోరిక కలగాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. త్వరలోనే కొరటాల కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన రాబోతుంది. కొంత కాలం వరకు మాత్రమే సినిమాలు చేస్తానంటూ అప్పట్లో చెప్పిన కొరటాల ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్తాడేమో చూడాలి.