ఆర్‌ఆర్‌ఆర్‌ పుకారుపై జీవిత క్లారిటీ

Jeevitha Clarity On Hero Rajashekar Role In Rajamouli Multi Starrer Film

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న మలీస్టారర్‌ చిత్రం గురించి ప్రస్తుంత ఎక్కడ చూసినా కూడా చర్చ జరుగుతుంది. ఎన్టీఆర్‌ ఏ విధంగా కనిపిస్తాడు, రామ్‌ చరణ్‌ ఎలా ఉండబోతున్నాడు, విలన్‌ ఎవరు, హీరోయిన్స్‌ ఎవరు అంటూ ఇలాంటి విషయాలపై సోషల్‌ మీడియాలో చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి.  ఇలాంటి సమయంలోనే ఈ చిత్రంలో విలన్‌గా రాజశేఖర్‌ కనిపించబోతున్నాడు అంటూ కొందరు, ఒక ముఖ్య పాత్రలో రాజశేఖర్‌ కనిపించబోతున్నాడు అంటూ మరి కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మల్టీస్టారర్‌ చిత్రంలో రాజశేఖర్‌ పాత్ర గురించి జీవిత క్లారిటీ ఇచ్చారు.

తాజాగా ఒక ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొన్న జీవిత రాజశేఖర్‌ మీడియాతో మాట్లాడుతూ మల్టీస్టారర్‌ చిత్రంలో తన భర్త నటించబోతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని, అసు అలాంటి ప్రతిపాదన తమ వద్దకు రాలేదు అంటూ తేల్చి చెప్పింది. తమ కుటుంబంతో ఉన్న సన్నిహిత్యం కారణంగా తమ కూతురు శివాని సినిమా ప్రారంభోత్సవంకు రాజమౌళి గారు వచ్చారు అంటూ జీవిత క్లారిటీ ఇచ్చింది. మల్టీస్టారర్‌ చిత్రం ఆఫర్‌ రాలేదు అని మాత్రమే జీవిత చెప్పారు, ఒక వేళ రాజమౌళి కోరుకుంటే రాజశేఖర్‌ తప్పకుండా మల్టీస్టారర్‌లో నటిస్తారు అని అనధికారికంగా చెప్పి నవ్వేశారు.

నిప్పు లేనిదే పొగ రాదు, అంటే రాజమౌళి మనస్సులో రాజశేఖర్‌ ఉండటం వల్లే పుకార్లు వస్తున్నాయని, అయితే ఆ విషయం ఇంకా రాజశేఖర్‌ వద్దకు వెళ్లి ఉండదు అని, ఖచ్చితంగా త్వరలోనే రాజశేఖర్‌ను రాజమౌళి కలుస్తాడని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ల మూవీలో రాజశేఖర్‌ విలన్‌ అయితే ఖచ్చితంగా సినిమా స్థాయి పెరగడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ పుకారుపై జీవిత క్లారిటీ - Telugu Bullet