చరణ్‌, ఎన్టీఆర్‌లకు జక్కన్న డేడ్‌లైన్‌

Rajamouli Sets Deadline For Ntr and Ram Charan over RRR Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్‌ ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాజమౌళి మల్టీస్టారర్‌ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటుంది. జక్కన్న ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ను ముగించే పనిలో ఉన్నాడు. అదే సమయంలో లొకేషన్స్‌ మరియు ఇతర విషయాల పట్ల చర్చలు జరుపుతున్నాడు. ఇక ప్రస్తుతం రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌లు వేరు వేరుగా సినిమాలు చేస్తున్నారు. ఎన్టీఆర్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అరవింద సమేత అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించినంత వరకు షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నారు. ఇక బోయపాటి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు త్వరగా పూర్తి చేసేందుకు కసరత్తు జరుగుతుంది. ఈ సమయంలోనే వీరిద్దరికి జక్కన్న డెడ్‌లైన్‌ పెట్టినట్లుగా తెలుస్తోంది.

సినీ వర్గాల్లో వినిపిస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లను ప్రస్తుతం వారు చేస్తున్న సినిమాలు సెప్టెంబర్‌ వరకు పూర్తి చేసుకోవాలని సూచించాడు. సెప్టెంబర్‌ తర్వాత పూర్తిగా తన సినిమాకు డేట్లు ఇవ్వాల్సి ఉంటుందని, కంటిన్యూగా షూటింగ్‌ చేసి 2019 చివరి వరకు సినిమాను విడుదల చేయాలని దర్శకుడు జక్కన్న భావిస్తున్నాడు. అందుకే ఆ సినిమా కోసం రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌లు ప్రస్తుతం చేస్తున్న సినిమాల షూటింగ్‌ స్పీడ్‌ను పెంచాల్సిందిగా దర్శకులకు సూచించినట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ మూవీ రాజమౌళి ఇచ్చిన డెడ్‌ లైన్‌కు ముందే అయిపోయే అవకాశం కనిపిస్తుంది. అయితే రామ్‌ చరణ్‌ మాత్రం కాస్త అటు ఇటు అయ్యే పరిస్థితి ఉంది. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ల కాంబో మూవీపై ఉన్న అంచనాలకు తగ్గట్లుగా జక్కన్న ఈ మల్టీస్టారర్‌ను తెరకెక్కిస్తున్నాడు.