ఎన్టీఆర్‌ బర్త్‌డేకు జక్కన్న కానుక.. నిజమేనా?

rajamouli-announcement about multistarrer movie on junior ntr birthday

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ల కలయికలో సినిమా రావడం అనేది ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడి కల. ఆ కలను దర్శక ధీరుడు, జక్కన్న రాజమౌళి నెరవేర్చబోతున్నాడు. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ల కాంబో మూవీ అనగానే అంచనాలు అంతులేకుండా పెరిగి పోయాయి. తన సత్తాతో ఏమాత్రం అంచనాలకు తగ్గకుండా దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మాత దానయ్య నిర్మించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాడు. ఇక ఈ చిత్రంకు సంబంధించి కేవలం ఒక చిన్న ప్రకటన మాత్రమే వెలువడినది. పూర్తి వివరాలను రివీల్‌ చేయకుండా సస్పెన్స్‌లో ఉంచారు. పూర్తి కథ కూడా ఇప్పటి వరకు హీరోలకు చెప్పలేదని సమాచారం అందుతుంది. అలాంటి జక్కన్న సినిమాకు సంబంధించిన కీలక ప్రకటను ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్బంగా రివీల్‌ చేయబోతున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

మే 20న ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్బంగా ప్రస్తుతం సినిమా చేస్తున్న త్రివిక్రమ్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నాడు. ఎన్టీఆర్‌ ఫస్ట్‌లుక్‌తో ఫ్యాన్స్‌కు పుట్టిన రోజు గిఫ్ట్‌ను ఇవ్వబోతున్నాడు. త్రివిక్రమ్‌ దారిలోనే రాజమౌళి కూడా ఎన్టీఆర్‌ బర్త్‌డే గిఫ్ట్‌ ఇస్తాడని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు నిజం కాదని, అందుకు చాలా సమయం ఉందని తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన ఎలాంటి విషయాన్ని ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్బంగా ప్రకటించబోవడం లేదు అంటూ ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. రాజమౌళి తాను అనుకున్న పని అనుకున్నట్లుగా పర్‌ఫెక్ట్‌గా చేస్తూ ముందుకు వెళ్తాడు. ఇలా బర్త్‌డేలు ఇంకా ఇతరత్ర విషయాలకు టెంమ్ట్‌ అయ్యి సినిమా విషయాలను చెప్పడు అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయినా కూడా నందమూరి అభిమానులు మాత్రం జక్కన్న నుండి ఏదో ఒకటి ఆశిస్తూనే ఉన్నారు.