జీవిత మీద పడ్డ శ్రీరెడ్డి

Sri Reddy release Jeevitha Rajasekhar hot video on Facebook

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు సినిమా పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ వల్ల ఎంతో మంది అమాయకమైన అమ్మాయిులు బలి అవుతున్నారని, ఎంతో మంది ఇండస్ట్రీని నమ్ముకుని వస్తున్న వారు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారంటూ మొదలు పెట్టిన శ్రీరెడ్డి ఉద్యమం గాడి తప్పి, అదుపు లేకుండా అటు ఇటుగా సాగుతుంది. శ్రీరెడ్డి కాస్టింగ్‌ కౌచ్‌పై ఉద్యమం ప్రారంభించిన సమయంలో ఆమె వెనుక పెద్ద ఎత్తున ప్రజా సంఘాల వారు పలువురు సినిమా వారు ఉన్నారు. కాని ఇప్పుడు ఆమె చేస్తున్న తప్పుల వల్ల ఒంటరిగా మిగిలి పోయింది. పవన్‌ కళ్యాణ్‌ తల్లిని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఏ స్థాయిలో దుమారంను రేపాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇటీవలే శ్రీరెడ్డి సోషల్‌ మీడియాలో జీవితను టార్గెట్‌ చేయడం జరిగింది. జీవిత మీడియా సమావేశంలో శ్రీరెడ్డితో పాటు పలువురిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేసింది. పోలీసులకు ఫిర్యాదు కూడా చేసిన విషయం తెల్సిందే. దాంతో శ్రీరెడ్డి కూడా జీవితపై రివర్స్‌ ఎటాక్‌ మొదలు పెట్టింది. అయితే మాటలతో కాకుండా కాస్త అదుపు తప్పి వీడియోలు పోస్ట్‌ చేస్తుంది. జీవిత చాలా సంవత్సరాల క్రితం తమిళంలో నటించిన ఒక చిత్రంకు సంబంధించిన వీడియో సాంగ్‌ను క్లిప్పింగ్స్‌ను విడుదల చేసింది. అందులో జీవిత రొమాంటిక్‌గా ఉండటం జరిగింది. ఇలాంటి రొమాంటిక్‌ సినిమాలు చేసిన నువ్వా నాకు చెప్పేది అంటూ జీవితకు శ్రీరెడ్డి కౌంటర్‌ ఇచ్చింది. అయితే ఆడవారి కోసం పోరాడుతున్న నువ్వు ఒక ఆడదాన్ని ఇలా బజారున పెట్టడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు అంటూ శ్రీరెడ్డిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవితపై పోరాటం ఆపి సజావుగా కాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఉద్యమం చేయాల్సిందిగా పలువురు సూచిస్తున్నారు.