నంది అవార్డులపై నోరు విప్పిన జీవిత

Jeevitha Rajasekhar reacts on Nandi Awards controversy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నంది అవార్డులు వివాదాస్పదం అవుతున్న విషయం తెల్సిందే. నంది అవార్డులు అనేవి తమ వారికి ఇచ్చుకున్నారని, రాజకీయంగా కొందరు అవార్డులు దక్కించుకున్నారని, టీడీపీ రాజకీయ లబ్ది కోసం నంది అవార్డులను వినియోగించుకుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నంది అవార్డుల జ్యూరీ సభ్యులపై కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అయ్యింది. నంది అవార్డుల ఎంపిక విషయంలో జ్యూరీ సభ్యులు అసలు ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా కేవలం ఏపీ ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం ఎంపిక చేసి సైన్‌ చేశారంటూ కొందరు ఆరోపిస్తున్నారు. నంది అవార్డుల జ్యూరీ సభ్యులపై వస్తున్న ఆరోపణలపై జీవిత స్పందించారు.

జ్యూరీ సభ్యుల్లో ఒక్కరు అయిన జీవిత మాట్లాడుతూ… సాదారణ ప్రేక్షకులు మరియు సినీ రంగ పెద్దలు నోరు విప్పడం లేదు కాని కొందరు మాత్రం కావాలని తెలుగు సినిమా పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారని, నంది అవార్డులపై వారు చేస్తున్న కామెంట్స్‌ చాలా చిల్లరగా ఉంటున్నాయని, టీవీ లైవ్‌ షోల్లో వారు చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే చాలా బాధగా ఉంటుందని చెప్పుకొచ్చారు. మూడు నెలల పాటు సినిమాలన్నీ చూసి, అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చా.

Jeevitha-Rajasekhar-reacts-

2015 సంవత్సరంకు గాను నంది జ్యూరీ చైర్మన్‌గా జీవిత వ్యవహరించారు. సినిమా బాగా తీశారు, డబ్బులు వచ్చాయి అనుకుని తాము అవార్డులు ఇవ్వలేదని, ఒక సినిమాను పది కోణాల్లో పరిశీలించి ఆ తర్వాత అవార్డులను ఇచ్చినట్లుగా ఆమె చెప్పుకొచ్చారు. చిరంజీవి, అల్లు అర్జున్‌, అల్లు అరవింద్‌ వంటి వారు సైలెంట్‌గా ఉంటే వీరు ఎందుకు మొత్తుకుంటున్నారో అర్థం కావడం లేదు అంటూ జీవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.