దానయ్య ఇదేం బాగాలేదయ్య!

DVV Danayya Pay Compensation Distributors

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇటీవల దానయ్య వరుసగా పెద్ద చిత్రాలను నిర్మిస్తు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా ఉన్నాడు. మహేష్‌బాబు, కొరటాల కాంబినేషన్‌లో వచ్చిన ‘భరత్‌ అనే నేను’ చిత్రంను దానయ్య నిర్మించిన విషయం తెల్సిందే. ఆ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రెండు వారాల్లో 200 కోట్లను వసూళ్లు చేసిందంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించింది. ఈ సమయంలోనే రామ్‌ చరణ్‌తో దానయ్య ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం విదేశాల్లో జరుగుతుంది. రంగస్థలం చిత్రం రికార్డు బ్రేక్‌ అంటూ భరత్‌ ప్రమోషన్స్‌ నిర్వహిస్తున్న నేపథ్యంలో మెగా ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఒక వైపు రామ్‌ చరణ్‌తో సినిమా నిర్మిస్తూ మరో వైపు ఆయన క్రేజ్‌ తగ్గించేలా ‘రంగస్థలం’ చిత్రాన్ని డామినేట్‌ చేసేలా ‘భరత్‌ అనే నేను’ చిత్రం ప్రమోషన్స్‌ను చేయడం ఎంత వరకు సమంజసం అంటూ మెగా ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే భరత్‌కు 200 కోట్లు వసూళ్లు వచ్చాయి అంటూ అధికారికంగా ప్రకటించారు. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని, రంగస్థలం బీట్‌ చేయాలనే ఒకే ఒక్క ఉద్దేశ్యంతో ఇలాంటి ప్రకటన చేశాడు అంటూ మెగా ఫ్యాన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై రామ్‌ చరణ్‌ కూడా కాస్త ఆగ్రహంతో ఉన్నాడని, దానయ్య వ్యవహార శైలి చరణ్‌కు ఆగ్రహంను తెప్పిస్తుందంటూ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ఈ వివాదం మరింతగా ముదిరితే చరణ్‌, బోయపాటి మూవీపై ప్రభావం పడే అవకాశం ఉందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.