విభ‌జ‌న హామీల అమ‌లుపై వివ‌రాలు తెల‌పండి…. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

Supreme-Court-send-notices-

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న హామీల అమ‌లు విష‌యంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య తీవ్ర వాదోప‌వాదాలు సాగుతున్న స‌మ‌యంలో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం అమ‌లుపై దాఖ‌లైన పిటిష‌న్ పై సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ఈ చ‌ట్టం ప్ర‌కారం ఇప్ప‌టివ‌ర‌కు అమలుచేసిన హామీల వివ‌రాలు తెలియ‌జేయాల‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం కేంద్ర‌ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. నాలుగువారాల్లోగా వివ‌రాలు స‌మ‌ర్పించాల‌ని గ‌డువు విధించింది. త‌దుప‌రి విచార‌ణ‌ను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం హామీల‌ను అమ‌లుప‌రిచేలా కేంద్రాన్ని ఆదేశించాల‌ని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాక‌ర్ రెడ్డి దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను విచారణ‌కు చేప‌ట్టిన కోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది.