బన్నీ నిజంగానే ఆర్మీలో..!

Allu Arjun joins in Indian ARMY in Real time

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హీరోలు అన్నప్పుడు అనేక రకాల పాత్రలు చేస్తూ ఉంటారు. ఏ పాత్ర పోషిస్తే ఆ పాత్రలో ఒదిగి పోయి, నటిస్తే వారిని సహజ నటుడు అంటారు. కొన్ని సార్లు ఆ పాత్ర కోసం తమను తాము మల్చుకోవడం చూస్తూ ఉంటాం. తాజాగా అల్లు అర్జున్‌ ‘నా పేరు సూర్య’ అనే చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. ఆ చిత్రంలో ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించి మెప్పించాడు. నిజంగా బన్నీ ఆర్మీ ఆఫీసర్‌ అయ్యి ఉంటాడు అన్నట్లుగా లుక్‌ను మెయింటెన్‌ చేశాడు. ఇక ఒక సినిమా చేసే సమయంలో ఆ సినిమా ప్రమోషన్‌ కోసం హీరోలు తమ పాత్ర గురించి అతిగా మాట్లాడుతూ ఉంటారు. తమ జీవితాన్ని మార్చేసిన పాత్ర అంటూ ఉంటారు. అందరిలాగే బన్నీ ‘నా పేరు సూర్య’ చిత్రంలోని పాత్ర తన జీవితాన్ని మార్చేసిందని అంటున్నాడు.

అల్లు అర్జున్‌ అందరిలా సినిమా ప్రమోషన్‌ కోసం అనుకుంటున్నాడని నిన్న మొన్నటి వరకు భావించాం. కాని తాజాగా ఆయన మాటల వెనుక నిజం ఉందని తేలిపోయింది. ఆర్మీ ఆఫీసర్‌ పాత్ర చేసిన అల్లు అర్జున్‌ నిజంగానే ఆర్మీలో జాయిన్‌ అవ్వాలని దరఖాస్తు చేసుకోవడం జరిగిందట. ఆర్మీలో గౌరవ సైనికుడిగా ఉండే అవకాశం ఉంది. ఆ అవకాశంను బన్నీ వినియోగించుకునేందుకు ఆసక్తిగా ఉన్నాడు. నా పేరు సూర్య చిత్రం సమయంలోనే అల్లు అర్జున్‌ ఆర్మీలో జాయిన్‌ అవ్వాలనే ఆసక్తిని వ్యక్తం చేశాడు. అందుకోసం దరఖాస్తును కూడా చేసుకోవడం జరిగింది. తాజాగా అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతుంది. త్వరలోనే అల్లు అర్జున్‌ నిజమైన సైనికుడు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. బన్నీ ఆర్మీలో జాయిన్‌ అయితే నిజమైన హీరో అనిపించుకుంటాడు.