సుమ రాజీవ్ కనకాల ఇంట్లో విషాదం

సుమ రాజీవ్ కనకాల ఇంట్లో విషాదం

రాజీవ్ కనకాల ఇంట్లో విషాదం టెలివిజన్, సినీ రంగాల్లో విశేషంగా రాణిస్తున్న స్టార్ కపుల్ సుమ, రాజీవ్ కనకాల ఇంట్లో మరో విషాదం చోటుచేసుకొన్నది. గత ఏడాది కాలంలోనే రాజీవ్ కనకాల తన తండ్రి, తల్లి, సోదరిని పొగొట్టుకొన్నారు. తండ్రి, తల్లి మరణాల సమయంలో ప్రతీ ఒక్కరు వెంట ఉండి మానసిక ధైర్యాన్ని ఇచ్చారు. దాంతో ఆ విషాదం నుంచి త్వరగా బయటపడ్డారు. కన్నీరుమున్నీరుగా తాజాగా తన సోదరి శ్రీలక్ష్మి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం రాజీవ్ కనకాలను మరింత విషాదంలోకి నెట్టింది. గత కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఏప్రిల్ 6వ తేదీన మరణించారు. ఇలాంటి కష్టకాలంలో రాజీవ్, సుమ దంపతులు కన్నీరుమున్నీరయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.

తమ్మారెడ్డి తల్లి మరణం ఇక ఏప్రిల్ 6వ తేదీన టాలీవుడ్‌లో మరో విషాదకరమైన సంఘటన చోటుచేసుకొన్నది. దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తల్లి స్వర్గస్తులయ్యారు. దాంతో ఆయన విషాదంలో మునిగిపోయారు. ఆయనకు పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు. చిరంజీవి, ఇతర సినీ ప్రముఖులు ఫోన్‌లోనే ఓదార్చారు. పరిస్థితులు దారుణంగా అయితే టాలీవుడ్‌లో చేసుకొన్న ఈ రెండు విషాద సంఘటనలకు ముందు కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఓ మాట చెప్పారు.

దయచేసి పరామర్శించడానికి ఎవరూ రావొద్దు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకొండి. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మా విషాదం మీ ఇంట్లోకి మరో విషాదాన్ని తెచ్చిపెట్టేలా ఉండకూడదు అని పలువురు ఆడియో రూపంలో రిక్వెస్ట్ చేశారు. రైటర్ హర్షవర్దన్ రిక్వెస్ట్ రాజీవ్ కనకాల స్నేహితుడు రచయిత, నటుడు హర్షవర్ధన్ ఓ ఆడియో ఫైల్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ ఇంటి వయకటకు రావొద్దు. రాజీవ్, సుమ కుటుంబం మానసికంగా ధైర్యంగా ఉన్నారు. కరోనా కారణంగా ఎవరూ పలకరింపు, శ్రద్దాంజలి ఘటించేందుకు రావొద్దు అంటూ ప్రాధేయపడ్డారు. అలాగే తమ్మారెడ్డి సన్నిహితులు కూడా ఇదే రిక్వెస్ట్‌ను ప్రకటన ద్వారా అందరికీ పంపించారు.