‘ఆర్‌’ స్టోరీ రెడీ అయ్యింది

Ram Charan and Jr NTR multistarrer Movie Story Ready

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా ఒక భారీ మల్టీస్టారర్‌ తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే. రికార్డు స్థాయి బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి విశేషాలు బయటకు రాలేదు. మీడియా వారు రామ్‌ చరణ్‌ లేదా ఎన్టీఆర్‌లను ప్రశ్నించిన సమయంలో వారు ఇంకా కథ మాకే చెప్పలేదు అంటూ చెబుతూ వచ్చారు. చిన్న స్టోరీ లైన్‌తోనే ఇద్దరిని ఒప్పించిన రాజమౌళి గత మూడు నెలలుగా కథను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్న నేపథ్యంలో కథకు సంబంధించిన వర్క్‌ పూర్తి అయ్యిందని తెలుస్తోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం గత కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్న కథను రాజమౌళి మరియు ఆయన టీం కలిసి సిద్దం చేశారని, అతి త్వరలోనే రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌లకు కలిపి ఒకేసారి రాజమౌళి కథను వివరించబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ మరియు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌లు సినిమాలు చేస్తున్నారు. వీరిద్దరితో వారం రోజులు డేట్లు తీసుకుని స్క్రిప్ట్‌ను చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో పాత్ర కోసం వారు ఎలా రెడీ అవ్వాలనే విషయాన్ని కూడా రాజమౌళి వారికి వివరించబోతున్నాడు. మరో మూడు నెలల్లో ఈ సినిమాను పట్టాలెక్కించే కార్యక్రమాలు చకచక జరుగుతున్నాయి. స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయిన తర్వాత హీరోయిన్స్‌ ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇద్దరు స్టార్‌ హీరోలు ఈ చిత్రంలో నటించబోతున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకబోతున్నాయి. మరి జక్కన్న ఏ రేంజ్‌లో ఈ సినిమాను తీస్తాడో చూడాలి.