నన్నేం చేయలేరు.. అఖిల్‌తో సినిమా చేస్తా

Ram Gopal Varma another time announces film with Akhil Akkineni

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మళ్లీ పవన్‌ ఫ్యాన్స్‌ను గెలుకుతున్నాడు. ఈమద్య శ్రీరెడ్డితో పవన్‌ కళ్యాణ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయించిన వర్మ ఆ విషయాన్ని స్వయంగా ఒప్పుకున్నాడు. దాంతో పవన్‌ ఫ్యాన్స్‌ తీవ్ర స్థాయిలో వర్మను ట్రోల్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ సమయంలోనే వర్మ తెరకెక్కించిన ‘ఆఫీసర్‌’ చిత్రం ఎలా విడుదల అవుతుందో చూస్తాం అంటున్నారు. మరి కొందరు వర్మను టాలీవుడ్‌ నుండి బ్యాన్‌ చేయాల్సిందే అని, అందుకోసం మెగా హీరోలు అంతా కూడా ఒక్కటి కావాలని ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్‌ చేస్తున్న ట్రోలింగ్‌కు వర్మ స్పందించాడు.

తాజాగా వర్మ సోషల్‌ మీడియాలో.. తనను ఎవరు ఏం చేయలేరని, తాను అనుకున్నది చేస్తాను అంటు చెప్పుకొచ్చాడు. తాను తెరకెక్కించిన ఆఫీసర్‌ చిత్రాన్ని విడుదల కాకుండా అడ్డుకోవడం ఎవరి వల్ల కాదని చెప్పుకొచ్చాడు. ‘ఆఫీసర్‌’ సినిమా విడుదలై సక్సెస్‌ కొట్టి, వెంటనే అఖిల్‌తో సినిమాను మొదలు పెడతాను అంటూ చెప్పుకొచ్చాడు. అఖిల్‌తో సినిమా గురించి వర్మ చాలా సీరియస్‌గానే ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో అఖిల్‌తో సినిమాను చేస్తాను అంటూ ప్రకటించిన వర్మ ఇప్పటికి అదే మాట మీద నిలబడి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అందరి దృష్టి ఆ సినిమా ఉంటుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వర్మపై వస్తున్న విమర్శల కారణంగా తన కొడుకును వర్మకు నాగార్జున అప్పగిస్తాడా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.