బట్టబయలవనున్న వైసీపీ – బీజేపీ రహస్య బంధం

Ramdas Athawale comments on Ys Jagan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

‘జగన్‌తో మాకు రహస్య ఒప్పందం లేదు. వచ్చే ఎన్నికల్లో జగన్‌తో చేతులు కలపాలన్న ఉద్దేశం కూడా మాకు లేదు. మీరు అనవసరంగా అపోహ పడుతున్నారు’ అని తెలుగుదేశం ఎన్డీయే నుండి బయట పడకముందు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా తనను కలిసిన టీడీపీ నేతలకు చెప్పిన మాటలివి. బీజేపీ త‌మ‌తో(టీడీపీ) క‌లిసే ఉన్నా… విప‌క్షం వైసీపీతో బంధం పెన‌వేసుకుంటోంద‌ని అప్పట్లోనే తెలుగుదేశం నేత ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే జగన్ ఎప్పుడూ బీజేపీని విమర్శించరని, అలాగే బీజేపీ నేతలు కూడా జగన్‌ను విమర్శించరని ఇవన్నీ చూస్తుంటే బీజేపీ, జగన్ మధ్య రహస్య ఒప్పందం ఉందేమోనని అనుమానం వస్తోందని సదరు నేత ఎన్డీయే నుండి బయటకి రాక మునుపే వ్యాఖ్యానించారు. అయితే తదుపరి పరిణామాల్లో గత నాలుగేళ్ళుగా కలిసి ఉన్న తెలుగుదేశం – భాజపా పార్టీలు విడిపోవడం ఇప్పటిదాకా కలసి ఉన్న కేంద్రం మీదే అవిశ్వాసం పెట్టడం చకచకా జరిగిపోయాయి.

అయితే తెలుగుదేశం కేంద్ర మంత్రులు రాజీనామా చేయక ముందు నుండే బీజేపీ వైసీపీకే ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది అప్పటిలో విజయసాయి రెడ్డి ప్రధాని కార్యాలయంలో మీడియా కంట పడి వారికి చిక్కకుండా పారిపోవడం చూస్తే జగన్-బీజేపీ మైత్రీ బంధానికి అప్పుడే ముడి పడినట్లు అర్ధం అయ్యింది. అదీ కాక వైసీపీ ఎంపీలు కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయ‌ల్ తో భేటీ అవ్వ‌డం మరిన్ని సందేహాలకు తావిచ్చింది. అప్పటికి బీజేపీ – టీడీపీ లు భాగస్వామ్య పార్టీలు. కాని టీడీపీ నేతలని కలవకుండా గోయల్ వైసీపీ ఎంపీలను కలవడం కూడా అప్పట్లో చర్చనీయంసం అయింది. కేంద్రంలో కొన్ని కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. వైసీపీ – బీజేపీ స్నేహ‌బంధం ఖాయ‌మ‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి.

అసలు హోదా ఇవాల్సిన మోడీని పల్లెత్తు మాట అన్ని వైసీపీ నేతలు బాబుని మాత్రం విమర్శిస్తూనే ఉన్నారు. అయితే ఎన్నికల తర్వాత ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయి అని భావించారు అంతా అయితే ఇప్పుడు ఎన్నికల ముందే ఈ రెండు పార్టీల పొత్తు ఖరారు అయ్యేలా కనపడుతోంది. ఓ సమావేశంలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే ఈ వాదనలకి మరింత ఊతం ఇచ్చేలా పలు వ్యాఖ్యలు చేసారు. వైకాపా ఆంధ్రప్రదేశ్ లో గట్టి పట్టు ఉన్న పార్టీ అని అలాగే ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలగడం తొందరపాటు చర్య అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఏమీ అన్యాయం చేయలేదని ఏపీకి సాయం చేయడానికి కేంద్రం ఇప్పటికీ సిద్ధంగా ఉందన్నారు. జగన్ కేసులు నిరూపితం అవ్వలేదన్న ఆయన జగన్ ని ఎన్డీయేతో కలిసేందుకు ఆహ్వానించారు. ఈ పరిణామాలు అన్నే చూస్తుంటే వీలయినంత త్వరలో ఇప్పటి దాకా వస్తున్న వీరి రహస్య బంధం బయటపడి ముందే పోత్తులకి వెళతారని అనిపిస్తోంది.