బీజేపీతో కలిస్తే జగనే సీఎం అట !

Union Minister Ramdas Athawale invites jagan into Nda

ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలగిన అనంతరం ఏపీ రాజకీయాల్లో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో బీజేపీ జతకట్టి టీడీపీని టార్గెట్ చేస్తున్నాయని తెలుగుదేశం నేతలు విమర్శిస్తున వేల హైదరాబాద్ పర్యటన సందర్భంగా కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏలో చేరాలని వైఎస్ జగన్‌కు ఆయన సలహా ఇచ్చారు. జగన్ ఎన్డీఏతో కలిస్తే ఏపీలో సీఎం అయ్యేందుకు సహకరిస్తామని స్పష్టం చేశారు. జగన్ ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నామని అన్నారు.

జగన్‌ ఎన్డీయేతో కలిస్తే ఆయన సీఎం అయ్యేందుకు సహకరిస్తామని, అలాగే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై మోదీ, అమిత్‌ షాలతో తాను మాట్లాడతానని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ నుంచి వైదొలగడం చంద్రబాబు తొందరపాటు నిర్ణయమని, ఆయన ఎన్డీయేలో కొనసాగి ఉంటే హోదాపై మోదీ సానుకూలంగా స్పందించేవారని చెప్పారు. కాగా, దేశంలో కాంగ్రెస్‌ పార్టీ ఉనికిని రాహుల్‌ గాంధీ కాపాడుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. ఎన్డీయేలో కొనసాగి ఉంటే హోదాపై మోడీ సానుకూలంగా స్పందించేవారన్నారు.