బాబును కలవనున్న సీబీఐ మాజీ జేడీ

cbi former jd meets chandrababu on very soon

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరతారు? పదవికి రాజీనామా చేసి ఆయన రాజకీయాల్లోకి వస్తున్న వార్తలు వచ్చింది మొదలు నడుస్తున్న చర్చ ఇది. బీజేపీ, టీడీపీ, జనసేన అంటూ ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆయన సీఎంని కలుస్తానని చెప్పడంతో ఇప్పుడు ఆయా ఏ పార్టీలో చేరనున్నారు అనే చర్చ మొదలయ్యింది. గత కొద్దిరోజులుగా రైతుల సమస్యలు కోసమని రాష్ట్ర పర్యటన చేస్తున్న ఆయన ఓర్వకల్లు మండలంలో పర్యటిస్తూన్న ఆయన సీఎం అపాయింట్‌మెంట్‌ తీసుకొని మొదట రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతానని, పరిష్క రించకపోతే రెండో దశలో మహారాష్ట్రలో జరిగిన విధంగా 40 వేల మంది రైతులతో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు.

‘మీ ఓటు మీ ఇష్టం వచ్చిన వారికే వేసుకోండి. అందరూ ఐక్యమత్యంగా ఉండండి’ అని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రైతులకు సూచించారు.ఉప్పలపాడులో ప్రకృతి వ్యవసాయం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శకునాలకు వెళ్లి సోలార్‌ పరిశ్రమలో భూములు కోల్పోయిన రైతులతో మాట్లాడారు. తమ పొలాలకు వెళ్లే దారులను పరిశ్రమవారు ఆక్రమించారని, తాము కోల్పోయిన భూములకు నష్టపరిహారం ఇంకా అందలేదనీ బాధిత రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కార్పొరేట్ సంస్థల కారణంగా రైతులు నష్టపోతున్నారని… రైతులు సంఘటితంగా ఉంటే కార్పొరేట్ శక్తులను నిలువరించవచ్చని చెప్పారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో రైతులతో ఆయన సమావేశమయ్యారు.