ఆ డైరెక్టర్ తొడ మీద చెయ్యివేసి….కావాలని అడిగాడట !

navajith narayanan talks about casting couch

హాలీవుడ్ నుండి టాలీవుడ్ వ‌ర‌కు అంద‌రు కాస్టింగ్ కౌచ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ప‌రిశ్ర‌మ‌లో మ‌హిళ‌లపై జ‌రుగుతున్న వేధింపుల విషయంలో పెద్ద ఉద్య‌మ‌మే న‌డుస్తుంది. సినిమాల‌లో అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని చెప్పి లైంగికంగా వాడుకుంటున్నారని ఈ ఉద్యమం జరుగుతోంది. అయితే ఇండ‌స్ట్రీలో మగాళ్ళకు కూడా ర‌క్ష‌ణ లేద‌ని తాజాగా ఓ భోజ్ పురి నటుడు రవికిషన్ సినీ పరిశ్రమలో మహిళలకు మాత్రమే కాక పురుషులకూ లైంగిక వేధింపులు ఉంటాయ‌ని చెప్పుకొచ్చాడు.

ఆ వ్యాఖ్యలు మరువక ముందే మలయాళ సినీ పరిశ్రమకు చెందిన నవజీత్ నారాయణ్ అనే నటుడు కూడా అది నిజమే అని చెప్పుకొచ్చాడు. ఐతే రవికిషన్ చెప్పిన వ్యవహారం వేరు ఇది వేరు పురుషులకు మహిళల నుంచి వేధింపులు ఎదురవుతాయని రవికిషన్ అంటే నవజీత్ మాత్రం ఒక సినిమా చిత్రీకరణ సందర్భంగా దర్శకుడి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాడట. తన కోరిక తీరిస్తే అవకాశాలు ఇప్పిస్తానంటూ ఆ దర్శకుడు అతడికి ఆఫర్ ఇచ్చాడట. అంతటితో ఆగకుండా అతడి తొడపై చెయ్యి వేసి అసభ్యంగా ప్రవర్తించాడట. చెయ్యి తీయమన్నా తీయకపోవడంతో నవజీత్ ఆ దర్శకుడి చెంప చెల్లుమనిపించాడట. ఆ దర్శకుడికి వార్నింగ్ కూడా ఇచ్చాడట. ఈ ఉదంతంతో పురుషుడికి కూడా రక్షణ లేదని తేలిపోయింది.