వర్మకి మతిమరుపు…ఇదిగో సాక్ష్యం.

Ram gopal varma have short term memory loss

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి పబ్లిసిటీ పిచ్చి ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన్ని ఏ కాస్త ఫాలో అయిపోయినా అయ్యగారి మ్యాటర్ అర్ధం అయిపోతుంది. అయితే ఆ పబ్లిసిటీ పిచ్చి ఇప్పుడు వర్మ కి ఇబ్బందిగా మారింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వెనుక వైసీపీ నేత రాకేష్ రెడ్డి వున్నాడన్న విషయం ప్రపంచానికి తెలిసిపోయింది. ఎన్టీఆర్ గురించి భారీ డైలాగ్స్ కొట్టి ఆయన బయోపిక్ తీస్తామని ఆర్భాటంగా ప్రకటించిన వర్మ ఇప్పుడు వైసీపీ నేత ఇచ్చిన డబ్బు కోసమే లక్ష్మీస్ ఎన్టీఆర్ తీస్తున్నాడు అనే విమర్శ బయటికి వచ్చింది. ఇప్పుడు ఆ విమర్శ నుంచి బయట పడడానికి వర్మ నానా అగచాట్లు పడుతున్నాడు. ” లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమా వెనుక వైసీపీ హస్తం అనే విషయం నుంచి జనం దృష్టి మళ్లించేందుకు వర్మ భలే ప్లాన్ వేసాడు.

అప్పుడెప్పుడో పవనిజం పేరిట రాసిన ఓ పుస్తకం గురించి ఓ ట్వీట్ వేసాడు. ఆ పుస్తకం ఎంత చదివినా అర్ధం కాలేదని మొదలెట్టి ఎప్పటి లాగానే పవన్ మీద చురకలు బాగానే వేసాడు. దీంతో పవన్ ఫాన్స్ రెచ్చిపోతారు. టాపిక్ డైవర్ట్ అయిపోతుందని వర్మ గారి ప్లాన్. అయితే అయ్యగారు తాజా తాజా హాట్ హాట్ అంటూ పెట్టిన పోస్ట్ ఎప్పుడో పెట్టేసారు. దాన్ని ఇంకోసారి రీ రిలీజ్ చేశారు అంతే. “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” తో వైసీపీ కి రాజకీయ ప్రయోజనం చేకూర్చే ఒప్పందం చేసుకున్న వర్మ ఇప్పుడు ఆ రహస్యం కాపాడ్డానికి మతిమరుపుతో పాత పోస్టులే పెట్టి జనం దృష్టిలో ఇంకాస్త చులకన అవుతున్నారు.