సోనాలీ బింద్రే చనిపోయిందని ట్వీట్ చేసిన కిడ్నాపింగ్ ఎమ్మెల్యే !

Ram kadam Tweets About Sonali Bendre Death

జన్మాష్టమి వేడుకల్లో అమ్మాయిలను కిడ్నాప్ చేసి మరీ పెళ్లి చేస్తానని పిలుపునిచ్చి వివాదంలో చిక్కిన ఆయన తాజాగా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గత కొద్దిరోజులుగా కేన్సర్‌తో బాధపడుతున్న బాలీవుడ్ నటి సోనాలి బింద్రే కన్నుమూసిందని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ ట్వీట్ చేసిన ఆయన నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. తనకు వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్‌ను క్రాస్ చెక్ చేసుకోని ఆయన దానిని స్క్రీన్ షాట్ తీసి దానిని యథాతథంగా ట్విట్టర్‌లో షేర్ చేశారు. అది చూసిన నెటిజన్లు ఆయనను దుమ్మెత్తి పోస్తున్నారు.

Sonali Bendre Death

సోనాలీ బింద్రే చనిపోయిందని ట్వీట్ చేసిన కిడ్నాపింగ్ ఎమ్మెల్యే ! - Telugu Bullet

ఎమ్మెల్యే షేర్ చేసిన వాట్సాప్‌ మెసేజ్‌లో.. ‘హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమను ఏలిన నటి సోనాలి బింద్రే ఇక లేరు. మనందరికీ ప్రియమైన ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం’ అని హిందీలో రాసుంది. దీనిని స్క్రీన్ షాట్ తీసిన రామ్ కదమ్ ఆ మెసేజ్‌లోని సమాచారాన్ని క్రాస్ చెక్ చేసుకోకుండా యథాతథంగా ట్విట్టర్‌లో షేర్ చేశారు. అది చూసిన నెటిజన్లు ఆయనపై తీవ్రస్థాయిలో ఏకేయడంతో ఆ ట్వీట్‌ను డిలీట్ చేసి క్షమాపణలు కోరుతూ మరో ట్వీట్ చేశారు. ‘‘సోనాలి గురించి వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఆమె త్వరగా కోలుకోవాలని, తిరిగి పూర్తి ఆరోగ్యవంతురాలు కావాలని భగవంతుడిని వేడుకుంటున్నా’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం సోనాలీ అమెరికాలో చికిత్స పొందుతోంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలు పోస్టు చేస్తూ అభిమానులతో తన అనుభవాలను పంచుకుంటోంది.

Ram kadam Tweet