‘నాగ్’ సాంగ్ నే ఫిక్స్ చేసిన ‘రామ్’…

Ram New Movie Title Hello Guru Prema Kosame

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్.. హిట్లు, ప్లాప్ లకు సంబంధం లేకుండా వరుసగా సినిమాలు తీస్తున్నాడు. నేను శైలజా మూవీ తో హిట్ దక్కించుకొని సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన, ఆ తర్వాత వచ్చిన సినిమాలు, శివం, ఉన్నది ఒకటే జిందగీ ఇలా వరుస ప్లాప్ లతో మళ్లీ డీలా పడుతున్నాడు. ఇప్పుడు మరో సినిమాను కూడా స్టార్ట్ చేసాడు. ఫస్ట్ టైం దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా లవ్ అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అవ్వడంతో, ఈ సినిమాకు నాగార్జున అమల ఫేవరేట్ సాంగ్ ” హలో గురు ప్రేమ కోసమే” అనే సాంగ్ నే ఈ సినిమా టైటిల్ గా ఫిక్స్ చేశారు.

Ram next Movie Title Hello Guru Prema Kosame

ఈ సినిమాలో హీరోయిన్ గా మలయాళీ భామ అనుపమా పరమేశ్వరన్ నటిస్తుంది… ఇంతకముందే వీళ్ళిద్దరూ ‘ఉన్నది ఒకటే జిందగీ ‘ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి ‘సినిమా చూపిస్త మామా’, నేను లోకల్ అంటూ రెండు హిట్లు సాధించిన త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం వహిస్తున్నాడు. వరుస హిట్లతో దుసుకుపోతున్న త్రినాధ రావు నక్కిన, సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్, సక్సెస్ఫుల్ నిర్మాత దిల్ రాజు, హీరోగా రామ్ ఈ క్రేజీ కాంబో లో మూవీ వస్తుండడంతో ” హలో గురు ప్రేమ కోసమే” మూవీ పై అప్పుడే ప్రేక్షకులలో అంచనాలు పెరిగిపోయాయి. మరి రిలీజ్ అయ్యాక ఈ మూవీ ఇంకా ఎన్ని రికార్డ్ లు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయిపొయింది.