నాగశౌర్యకు సాయి పల్లవి రివర్స్ కౌంటర్‌

Sai Pallavi Reverse Counter For Naga Shaurya in Kanam promotions
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘ఛలో’ చిత్ర ప్రమోషన్‌ సమయంలో నాగశౌర్య మాట్లాడుతూ సాయి పల్లవితో తాను నటించిన చిత్రం ‘కణం’ చిత్రీకరణ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాము అని, సాయి పల్లవి అస్సలు సమయంకు వచ్చేది కాదు అని, ఆమె వల్ల అందరు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంటూ చెప్పుకొచ్చాడు. సాయి పల్లవి ప్రతి విషయంలో కూడా దురుసుగా వ్యవహరించేది అంటూ నాగశౌర్య సంచలన కామెంట్స్‌ చేసింది. అయితే అందుకు కౌంటర్‌ అన్నట్లుగా సాయి పల్లవి చాలా విభిన్నంగా స్పందించింది. నాగశౌర్యను విమర్శించకుండా ప్రశంసించి అందరి దృష్టిని ఆకర్షించింది.

సాయి పల్లవి తాజాగా ‘కణం’ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్బంగా సాయి పల్లవి మాట్లాడుతూ తనకు నాగశౌర్య మంచి మిత్రుడు అని, ఆయనతో చేసిన సినిమా తనకు మంచి అనుభూతిని కలిగించిందని చెప్పుకొచ్చింది. నాగశౌర్య మంచి నటుడు అవ్వడంతో పాటు మంచి హ్యుమన్‌ బీయింగ్‌ అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది. సాయి పల్లవి చేసిన ఈ కామెంట్స్‌ నాగశౌర్య విమర్శలకు కౌంటర్‌ అంటూ కొందరు అంటుండగా, మరి కొందరు మాత్రం సాయి పల్లవి మంచి మనసు అంటూ అభినందనలు తెలియజేస్తున్నారు.