రామ్‌ చరణ్‌ దసరా కానుక…!

Vinaya Vidheya Rama Releases On Jan 11

మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌, కియారా అద్వానీ జంటగా యాక్షన్‌ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్‌ చకచక జరుగుతోంది. ఇంకా టైటిల్‌ ఫిక్స్‌ కాని ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా కోసం రామ్‌ చరణ్‌ మరియు బోయపాటిలు చాలా కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను పవన్‌ కళ్యాణ్‌ బర్త్‌డే సందర్బంగా విడుదల చేయాలని భావించారు. కాని అనూహ్యంగా సినిమా లుక్‌ను కాకుండా ఒక వీడియోను చరణ్‌ విడుదల చేశాడు.

ram-charam-movies

 

సినిమా ఫస్ట్‌లుక్‌కు రంగం సిద్దం అయ్యింది. దసరాకు ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతుంది. భారీ ఎత్తున ఈ చిత్రం రూపొందుతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా పెంచేందుకు ఫస్ట్‌లుక్‌ టీజర్‌తోనే దుమ్ము లేచిపోయేలా బోయపాటి ప్లాన్‌ చేస్తున్నాడు. దసరా రోజున ఫస్ట్‌లుక్‌ టీజర్‌తో పాటు, టైటిల్‌పై కూడా క్లారిటీ ఇవ్వాలని భావిస్తున్నారు. రంగస్థలం చిత్రం తర్వాత రామ్‌ చరణ్‌ చేస్తున్న సినిమా ఇదే కావడంతో బాక్సాఫీస్‌ వద్ద సందడి భారీగా ఉండటం ఖాయం అనే టాక్‌ వినిపిస్తుంది.

 

boyapati-srinu