ఆకాశ్ పూరి సినిమా లో కీల‌క పాత్ర‌ పోషిస్తున్న ర‌మ్య‌కృష్ణ

ఒక‌ప్పుడు హీరోయిన్‌గా అల‌రించిన ర‌మ్య‌కృష్ణ ప్ర‌స్తుతం స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. బాహుబ‌లి చిత్రంలో శివ‌గామి పాత్ర ఆమె కెరీర్‌ని అత్యున్న‌త స్థానంలో నిలబెట్టింది. ప‌లు చిత్రాల‌లో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న ర‌మ్య‌కృష్ణ ఇప్పుడు రొమాంటిక్ చిత్రంలో ఫుల్ లెంగ్త్ రోల్ పోషిస్తుంద‌ట‌. ఆమె పాత్ర చిత్రానికి కీల‌కంగా మార‌నుంద‌ని అంటున్నారు. నేటి నుండి హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నున్న షెడ్యూల్‌లో టీంతో జాయిన్ కానుంది. పూరీ జ‌గ‌న్నాథ్ నిర్మాణంలో ఆకాశ్ పూరి, కేతికా శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న రొమాంటిక్ చిత్రానికి అనీల్ పాడూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటులు మకరంద్ దేశ్ పాండే, మందిరాబేడీ కీలకపాత్రలో నటిస్తున్నారు.