బన్నీ చిత్రంలో రణ్ వీర్ సింగ్

బన్నీ చిత్రంలో రణ్ వీర్ సింగ్

టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన రీసెంట్ మూవీ అలా వైకుంఠ పురంలో చిత్రాన్ని రీమేక్ చేసేందుకు బాలీవుడ్ సిని నిర్మాతలు చాలా ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ చిత్రం లో అల్లు అర్జున్ హీరో గా నటించగా, బాలీవుడ్ లో మాత్రం రణ్ వీర్ సింగ్ హీరో గా నటిస్తారు అంటూ గత కొద్దీ రోజులు నుండి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో రన్ వీర్ సింగ్ నటించడం లేదు అని ఇపుడు అతని సన్నిహితులు కొందరు అంటున్నారు.

బన్నీ అలా వైకుంఠ పురంలో చిత్ర రీమేక్ లో రణ్ వీర్ సింగ్ నటించడం లేదు అని, రణ్వీర్ సింగ్ చేతిలో ఇపుడు భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి అని, అవి పూర్తి కావడానికి కాసింత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే లాక్ డౌన్ అనంతరం రన్ వీర్ సింగ్ చిత్రాలకు సంబందించిన కొన్ని పోస్టర్స్ విడుదల అవుతాయి అని వ్యాఖ్యానించారు. అవి అభిమానులకు చాలా స్పెషల్ గా ఉంటాయి ఆని అన్నారు.

అయితే అలా వైకుంఠ పురంలో చిత్రం తో అల్లు అర్జున్ తన సత్తాను చాటుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో లు ఈ చిత్రం పై మనసు పారేసుకున్నారు. ఈ చిత్రం లో పూజ హెగ్డే అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. రన్ వీర్ సింగ్ ప్రస్తుతం 83 చిత్రంలో హీరో గా నటిస్తున్నారు. అంతేకాక సూర్య వంశీ అనే మరొక చిత్రం లో నటించేందుకు వేచి ఉన్నారు.