రీ రిలీజ్ కి రెడీ : ఉదయ్ కిరణ్ అభిమానులకు గుడ్ న్యూస్ !

Ready for re-release: Good news for Uday Kiran fans!
Ready for re-release: Good news for Uday Kiran fans!

దివంగత నటుడు ఉదయ్ కిరణ్ గతంలో నటించిన మూవీ ల్లో ఆయనకు బాగా క్రేజ్ తెచ్చిపెట్టినవి నువ్వు నేను, మనసంతా నువ్వే. ఇవి రెండూ కూడా అప్పట్లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అయి నటుడిగా ఉదయ్ కిరణ్ కు యువతలో విశేషమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి. నువ్వు నేను సినిమా లో అనిత హీరోయిన్ గా నటించగా తేజ దర్శకత్వం వహించారు. మనసంతా నువ్వే సినిమా ని విఎన్ ఆదిత్య తెరకెక్కించగా రీమా సేన్ హీరోయిన్ గా నటించారు.

Ready for re-release: Good news for Uday Kiran fans!
Ready for re-release: Good news for Uday Kiran fans!

ఇక ఈ రెండూ కూడా హార్ట్ టచింగ్ లవ్ స్టోరీస్ కావడం విశేషం. మ్యాటర్ ఏమిటంటే, రానున్న మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ రెండు మూవీస్ కూడా రీ రిలీజ్ కు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మనసంతా నువ్వే రీ రిలీజ్ అవుతుందని న్యూస్ రావడం జరిగింది. అయితే పక్కాగా ఈ రెండు మూవీస్ యొక్క రీ రిలీజ్ డేట్స్ కు సంబంధించి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ రానున్నాయట.