ఉదయ్‌ కిరణ్‌ బయోపిక్‌.. తేజ క్లారిటీ

director teja clarity about uday kiran biopic rumours

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ నుండి తప్పుకున్న తేజ పలువురు హీరోలతో సినిమాలు చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. వెంకటేష్‌, నాగార్జున, రానా ఇలా పలువురు పేర్లు వినిపించాయి. చివరకు తేజ తాను హీరోగా పరిచయం చేసిన ఉదయ్‌ కిరణ్‌ జీవిత చరిత్ర ఆధారంగా ఒక సినిమాను చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని, అంతా కొత్త వారితో సినిమాను తెరకెక్కించేందుకు దర్శకుడు తేజ ‘కాబోయే అల్లుడు’ అంటూ ఒక టైటిల్‌ను కూడా రిజిస్ట్రర్‌ చేయించాడు అంటూ ప్రచారం జరిగింది. కాని ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.

తాను ఉదయ్‌ కిరణ్‌ ఆటో బయోగ్రఫీని తెరకెక్కించబోతున్నట్లుగా వస్తున్న వార్తలను దర్శకుడు తేజ ఖండిరచాడు. తనకు అలాంటి ఉద్దేశ్యం లేదని, అంతా కొత్త వారితో ఒక సినిమాను చేయబోతున్న మాట మాత్రం వాస్తవమే, కాని అది మాత్రం ఉదయ్‌ కిరణ్‌ లైఫ్‌ హిస్టరీ కాదు అంటూ తేజ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఒత్తిడి కారణంగానే సినిమాను తేజ అటకెక్కించాడు అని, టైటిల్‌తోనే దర్శకుడు అందరి దృష్టి ఆకర్షించాడు. మెగా ఫ్యామిలీ పరువు తీసేలా ఆ సినిమా ఉండే అవకాశం ఉందని అంతా భావించారు. అందుకే బలవంతంగా ఆ సినిమాను క్యాన్సిల్‌ చేయించినట్లుగా తెలుస్తోంది. తేజ తాను చేయడం లేదని ప్రకటించినా కూడా ఇంకా పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి.