పిక్‌ : బెల్లంకొండ ‘కవచం’ అదిరింది

Bellamkonda Sreenivas 'Kavacham' first look

‘అల్లుడు శీను’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ సినిమా సినిమాకు క్రేజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఈమద్య కాలంలోనే ఈయన ‘సాక్ష్యం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంతకు ముందు జయ జానకి నాయక చిత్రంతో ఆకట్టుకున్నాడు. ఇలా వరుసగా మంచి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బెల్లకొండ శ్రీనివాస్‌ తాజాగా తేజ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ చిత్రంలో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తున్న ఈ చిత్రానికి తేజ టైటిల్‌ ను ఖరారు చేయడంతో పాటు బెల్లంకొండ ఫస్ట్‌లుక్‌ను కూడా రివీల్‌ చేయడం జరిగింది. ఈ చిత్రానికి ‘కవచం’ అనే పవర్‌ ఫుల్‌ టైటిల్‌ను పెట్టారు.

Kavacham

తేజ గత చిత్రం ‘నేను రాజు నేనే మంత్రి’ చిత్రంతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. మంచి ఫాంలో ఉన్న తేజ ఈ చిత్రంతో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు నమ్మకంతో ఉన్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్‌ హీరోయిన్‌ అవ్వడం వల్ల అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. ఇక ఉన్నట్లుండి ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన నేపథ్యంలో సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. డిసెంబర్‌లో పలు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా తేజ ప్రకటించడం ఏంటీ అంటూ చర్చ జరుగుతోంది.