నాకికి బిగ్‌బాస్‌ ఇచ్చేది ఎంతో తెలుసా?

Nani Remuneration for Bigg Boss Telugu Show Hosting

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 2 త్వరలో ప్రారంభం కాబోతుంది. మొదటి సీజన్‌కు హోస్ట్‌గా ఎన్టీఆర్‌ వ్యవహరించిన విషయం తెల్సిందే. అయితే ఈ రెండవ సీజన్‌కు మాత్రం నాచురల్‌ స్టార్‌ నాని హోస్ట్‌గా చేయబోతున్నాడు. భారీ స్థాయిలో అంచనాల నడుమ నానితో కొత్తగా స్టార్‌ మా వారు ఈ సీజన్‌ను మొదలు పెట్టబోతున్నారు. గతంతో పోల్చితే ఈ సీజన్‌ 30 రోజులు అదనంగా ప్రసారం కాబోతుంది. దాంతో పాటు పార్టిసిపెంట్స్‌ సంఖ్య కూడా ఎక్కువగా ఉండబోతుంది. అందుకే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఈ సీజన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. 

ఇక మొదటి సీజన్‌లో ఎన్టీఆర్‌ హోస్టింగ్‌ చేసినందుకు గాను భారీ మొత్తంలో పారితోషికంగా పుచ్చుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈసీజన్‌కు నాని కూడా దాదాపు అంతే స్థాయిలో పారితోషికంగా తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్‌ 70 రోజుల షోకు మాత్రమో హోస్ట్‌గా చేస్తే నాని మాత్రం 100 రోజుల షోకు హోస్ట్‌గా చేయబోతున్నాడు. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ షోకు నాని ఏకంగా 4 కోట్ల పారితోషికాన్ని తీసుకోబోతున్నాడు. స్టార్‌ మా వారు నానికి మూడు కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. కాని నాని మాత్రం నాలుగు కోట్లు ఇస్తేనే చేసేది అంటూ తేల్చి చెప్పడంతో కొంత కాలం వేచి చూసిన స్టార్‌ మా వారు ప్రత్యామ్నాయం లేక పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నాలుగు కోట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. వచ్చే నెలలో ఈ షో ప్రసారం మొదలు కాబోతుంది. పార్టిసిపెంట్స్‌కు కూడా ఈసారి పారితోషికం ఎక్కువగా ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.

 నాకికి బిగ్‌బాస్‌ ఇచ్చేది ఎంతో తెలుసా? - Telugu Bullet