తేజూ ఇకనైనా మారాలి

reason behind intelligent movie flop
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇంటిలిజెంట్‌’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడటంతో సాయి ధరమ్‌ తేజ్‌ కెరీర్‌ విషయంలో మెగా ఫ్యామిలీ ఆందోళనలో పడ్డట్లుగా తెలుస్తోంది. వరుసగా మూడు నాలుగు ఫ్లాప్‌లు రావడంతో ఏం చేయాలో పాలుపోక మెగా ఫ్యామిలీ టెన్షన్‌లో పడ్డట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం గత కొంత కాలంగా తేజ చేస్తున్న చిత్రాలు చాలా రొటీన్‌గా ఉంటున్నాయి. ఏమాత్రం ఆకట్టుకోని కాన్సెప్ట్‌తో ఈయన చేస్తున్నాడు. కథ విషయంలో జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్లే ఈ పరిణామం చోటు చేసుకుందని విశ్లేషకులు అంటున్నారు.

వరుణ్‌ తేజ్‌ వరుసగా రెండు మూడు సక్సెస్‌లు దక్కించుకుని కెరీర్‌లో దూసుకు పోతున్నాడు. ఈ సమయంలోనే తేజూ మాత్రం కెరీర్‌లో వెనకడుగులు వేస్తున్నాడు. దర్శకులు మరియు నిర్మాతలను కాకుండా కథపై నమ్మకంతో తేజూ సినిమా చేస్తే ఫలితం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కథల విషయంలో జాగ్రత్తలు తీసుకోనట్లయితే తేజూ కెరీర్‌లో మరింతగా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ సందర్బంగా సాయిధరమ్‌ తేజ్‌ సన్నిహితులు మరియు విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి తేజూ ఇకపై అయినా కొత్త కథలను చేసేందుకు ఆసక్తి చూపిస్తాడా అనేది చూడాలి.