భారతీయ సినీ ప్రేక్షకులని కలచివేసిన సుశాంత్ మరణం

భారతీయ సినీ ప్రేక్షకులని కలచివేసిన సుశాంత్ మరణం

ఈ ఏడాదిలో బాలీవుడ్ కు చెందిన మోస్ట్ టాలెంటెడ్ నటులు ఎక్కువగా కన్ను మూయడం ఒక్క ఆ ఇండస్ట్రీకే కాకుండా మొత్తం భారతీయ సినీ ప్రేక్షకులనే కలచివేసింది. ఈరోజు అక్కడి యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోయారు అని వచ్చిన వార్త మరింత విషాదాన్ని నెలకొల్పింది.

అయితే ఈ విషాద ఘటనకు సంబంధించి అసలు కారణం ఏమిటి అన్నది ఇంకా తెలియరాలేదు. కానీ బలమైన కారణాలు సుశాంత్ ఈ నిర్ణయాన్ని తీసుకోడానికి దారి తీసి ఉంటయి అని తెలుస్తుంది. గత కొన్ని రోజుల క్రితమే సుశాంత్ మాతృమూర్తి కన్నుమూయగా తన ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ ద్వారా తన బాధను తెలిపారు.

అలాగే తన దగ్గర పని చేసిన ఓ లేడీ మేనేజర్ ఆత్మహత్య చేసుకొందని పైగా గత నుంచి ఎందుకో డిప్రెషన్ లో ఉన్నాడని..ఈ కారణాల చేత అతను ఆత్మ హత్య చేసుకున్నాడని టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ వార్త మాత్రం అన్ని ఇండస్ట్రీ ప్రముఖులను ఎంతగానో బాధించింది. మరి ఇది అసలు కారణమా కాదా అన్నది తెలియాలి.