ప్రైవేట్ ల్యాబ్ లలో, ఆసుపత్రులలో కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు: కేసీఆర్

ప్రైవేట్ ల్యాబ్ లలో, ఆసుపత్రులలో కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు: కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు గాంధీ ఆసుపత్రిలోనే కరోనా వైరస్ మహమ్మారి కి చికిత్స చేస్తున్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక పై ప్రైవేట్ ల్యాబ్ లలో, ఆసుపత్రులలో నిర్దారణ పరీక్షలు, చికిత్స కు కూడా అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకీ పెరుగతుండటంతో తెలంగాణ సర్కార్ మరొక నిర్ణయం తీసుకుంది.

అయితే హైదరాబాద్, రంగారెడ్డి,మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి ప్రాంతాలలో ముప్పై నియోజక వర్గాలకు పైగా దాదాపు యాభై వేల మందికి పైగా రానున్న పది రోజుల్లో కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ ల్యాబ్ లలో, ఆసుపత్రులలో పరీక్షలకు, చికిత్స కి తగు మార్గదర్శకాలను, ధరలను నిర్ణయించాలి అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పలు సూచనలు కూడా చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్సలు, నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తుండగా, ఇక పై పరీక్షల కోసం, చికిత్స కోసం ఇక పై ప్రైవేట్ ఆసుపత్రులు కూడా సిద్దం కానున్నాయి. అయితే పాజిటివ్ గా తేలి, లక్షణాలు లేని వారికి ఇంట్లో ఉండి చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గాంధీ ఆసుపత్రి లో జూనియర్ డాక్టర్ల నిరసన పెద్ద ఎత్తున సోషల్ మీడియా లో కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వానికి కూడా ఈ విషయం తీవ్రత తెలవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.