ప్రొఫెషనల్ క్రికెట్ ఆడగల సత్తా సుశాంత్ లో ఉంది :సచిన్ టెండూల్కర్

ప్రొఫెషనల్ క్రికెట్ ఆడగల సత్తా సుశాంత్ లో ఉంది :సచిన్ టెండూల్కర్

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడం పై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే సుశాంత్ ఎం ఎస్ ధోనీ సినిమా కోసం భారత్ మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే ఎంతో సహాయం చేశారు. ఆ చిత్రానికి సంబంధించి ఈయనది చాలా పాత్ర ఉంది అని తెలుస్తోంది. అయితే ఈ చిత్రం గురించి తెలిపారు.

ఇది నాకు వ్యక్తిగతంగా దిగ్భ్రాంతి కలిగించే క్షణం అని అన్నారు. ఎమ్మెస్ ధోనీ పాత్ర కోసం సుశాంత్ కి నేనే శిక్షణ ఇచ్చాను అని అన్నారు. ఈ షాక్ నుండి ఎలా బయటపడాలో అర్దం కావడం లేదు అని, మంచి స్నేహితుడు త్వరగా వెళ్ళిపోయాడు అని అన్నారు. సుశాంత్ బ్యాటింగ్ చూసి సచిన్ టెండూల్కర్ నివ్వెరపోయారు అని, ఆ క్షణం తనకు ఇంకా గుర్తు ఉంది అని కిరణ్ మొరే అన్నారు. ఎమ్మెస్ ధోనీ బయోపిక్ కోసం ట్రైన్ అవుతుండగా, డైరెక్టర్ నీరజ్ పాండే, నిర్మాత అరుణ్ పాండే కోరడం తో వికెట్ కీపింగ్, బ్యాటింగ్ లో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.

అయితే కొన్ని రోజుల తర్వాత సుశాంత్ హెలికాప్టర్ షాట్ సాధన చేస్తుండగా, అనుకోకుండా సచిన్ గ్రౌండ్ లోకి వచ్చారు అని వ్యాఖ్యానించారు.అయితే టెండూల్కర్ గ్యాలరీ నుండి చూశారు అని, ప్రాక్టీస్ అనంతరం కలవగా, కుర్రాడు బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు ఎవరూ అని సచిన అడగగా, అతను సినీ నటుడు అని ధోనీ బయోపిక్ కోసం సిద్దం అవుతున్నాడు అని అన్నాను అని తెలిపారు. ఈ వ్యాఖ్యలకు సచిన్ షాక్ అయినట్లు తెలిపారు. అతనికి ఆట పై ఆసక్తి ఉంటే ప్రొఫెషనల్ క్రికెట్ ఆడగల సత్తా అతనిలో ఉంది అని, మంచివాడిలా కనిపిస్తున్నాడు అని అన్నారు.