పవర్‌స్టార్‌ అంటే రేణుకు కోపం వస్తుందట!

Renu Desai says don't call my son Akira Nandan as Jr Powerstar

నిన్న మొన్నటి వరకు పవన్‌ మాజీ భార్యగా ఉన్న రేణుదేశాయ్‌ మరి కొన్ని రోజుల్లో తన స్నేహితుడిని వివాహం చేసుకుని కొత్త జీవితంను ప్రారంభించేందుకు సిద్దం అవుతుంది. పవన్‌ కళ్యాణ్‌ నుండి విడిపోయినా కూడా ఆయనపై తనకు ప్రేమ ఉందని, కొన్ని కారణాల విడిపోయాం అంటూ చెబుతూ వచ్చిన రేణుదేశాయ్‌, ఎప్పటికప్పుడు పవన్‌ కళ్యాణ్‌ను కలవడం, పవన్‌ కళ్యాణ్‌తో పిల్లల విషయమై మాట్లాడటం, పవన్‌ కళ్యాణ్‌ గురించి పాజిటివ్‌గా రెస్పాండ్‌ అవ్వడం చేస్తూ వస్తుంది. ఇంత కాలం పవన్‌ నామ జపం చేసిన రేణుదేశాయ్‌ ప్రస్తుతం మాత్రం పవన్‌ కళ్యాణ్‌ పేరును పలికేందుకు కూడా ఇష్టపడటం లేదు అనిపిస్తుంది.

పవన్‌ కళ్యాణ్‌, రేణు దేశాయ్‌లకు ఒక కొడుకు ఉన్న విషయం తెల్సిందే. ఆ కొడుకును మెగా ఫ్యాన్స్‌ ముద్దుగా జూనియర్‌ పవర్‌ స్టార్‌ అంటూ పిలుచుకుంటున్నారు. తన కొడుకును అలా అనడం ఇష్టం లేదు అంటూ రేణుదేశాయ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. తన కొడుకుకు సంబంధించిన ఎలాంటి విషయాల్లో అయినా పవన్‌ కళ్యాణ్‌ ముద్ర ఉండవద్దని ఆమె కోరుకుంటుంది. అందుకే తన కొడుకును జూనియర్‌ పవర్‌ స్టార్‌ అవద్దని గట్టిగానే చెబుతుంది. మొత్తానికి రేణుదేశాయ్‌ పెళ్లి ఫిక్స్‌ అవ్వగానే పవన్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని భావిస్తుందని, పిల్లల విషయంలో కూడా ఇకపై పవన్‌ జోక్యం కల్పించుకోకుండా ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పవన్‌ పిల్లలను పూర్తిగా పూణెకు పరిమితం చేయాలని కూడా భావిస్తుంది. త్వరలోనే పెళ్లికి సిద్దం అవుతున్న రేణుదేశాయ్‌ ముందు ముందు మరెంతగా పవన్‌ విషయంలో కఠినంగా వ్యవహరిస్తుందో అంటూ మెగా ఫ్యాన్స్‌ ఆందోళనతో ఉన్నారు.