ఆ నిర్ణయం నాకు ఎంతో ఇంపార్టెంట్ – రేణు దేశాయ్

ఆ నిర్ణయం నాకు ఎంతో ఇంపార్టెంట్ – రేణు దేశాయ్
Cinema News

‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రేణు దేశాయ్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి. రేణు దేశాయ్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషించింది. ఈ సందర్భంగా రేణు దేశాయ్ మాట్లాడుతూ .. “నేను మూవీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 22 ఏళ్లు దాటింది . అయినా నాకు మాత్రం ‘బద్రీ’ ఈ మధ్యనే రిలీజ్ అయిందనే ఫీలింగ్ ఉన్నది . ఇంతకాలంగా నేను తెలుగు మూవీ లు చేయకపోయినా, మీరంతా నా పై అదే ప్రేమను కూడా చూపించారు. ఈ మూవీ లో నాకు ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు నేను థ్యాంక్స్ చెబుతున్నాను అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.

ఆ నిర్ణయం నాకు ఎంతో ఇంపార్టెంట్ – రేణు దేశాయ్
Renu Desai

రేణు దేశాయ్, రవితేజ గురించి కూడా మాట్లాడుతూ.. ‘రవితేజగారి వంటి సీనియర్ స్టార్ తో కలిసి పనిచేయడం నాకు ఆనందంగా అనిపిస్తోంది. రవితేజ తీసుకున్న నిర్ణయం నాకు ఎంత ఇంపార్టెంట్ అనేది ఆయనకు తెలిసి ఉండదు . ఈ వేదిక ద్వారా .. పర్సనల్ గాను రవితేజ గారికి థాంక్స్ చెబుతున్నాను’ అని రేణు దేశాయ్ ఎమోషనల్ కామెంట్స్ పెట్టింది . ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరుగాంచిన స్టువర్ట్‌ పురానికి చెందిన వ్యక్తి ఈ ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ మూవీ ఈ నెల 20వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ అగ‌ర్వాల్ అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా ఈ సినిమా ని నిర్మిస్తున్నాడు.