రెండో పెళ్లి చేస్కున్న మాజీ కెప్టెన్

రెండో పెళ్లి చేస్కున్న మాజీ కెప్టెన్

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్  తన ప్రేయసి రోమీ లాంఫ్రాంచీని పెళ్లాడాడు. దక్షిణాఫ్రికా రగ్బీ జట్టు ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి రగ్బీ ప్రపంచ కప్ గెలిచిన రోజున వివాహం జరిగడం విశేషం. గత ఏడాదిలో ఎంగేజ్‌ మెంట్‌ అయిన నేపత్యంలో ఇపుడు ఎడమ చేతి వాటం బ్యాట్స్‌ మెన్‌ రోమీ తన ప్రేయసి లాంఫ్రాంచీని పెళ్ళాడి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తన అభిమానులు నెటిజన్లు ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇవే కాకుండా ఇన్‌స్టాగ్రామ్లో కూడా ఫోటోలను షేర్‌ చేశారు.

2011లో ఐరిష్ పాప్ గాయకురాలు మోర్గాన్ డీన్‌ను వివాహం చేసుకుని పాప కాడెన్స్ ఇంకా కుమారుడు కార్టర్ ఉండగా అయితే 2015 ఫిబ్రవరిలో ఆమె నుంచి విడి పోయాడు. అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన స్మిత్‌,  క్రికెట్ వ్యాఖ్యాతగా విశ్లేషకుడిగా ఉన్నారు.

తన ప్రతిభతో ఉత్తమ కెప్టెన్‌గా అతి చిన్న వయస్సులో దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా ఎంపికైన గ్రేమ్ స్మిత్‌ సేవలు అందించాడు. గ్రేమ్ స్మిత్‌ టెస్టుల్లో 108గేమ్స్‌లో 53విజయాలు, వన్డేల్లో మొత్తం 149ఆటలలో 92 విజయాలు, టీ20లలో 27మ్యాచ్‌ల్లో 18విజయాలు సాధించాడు. తన కెరీర్ మొత్తంలో 17000పరుగులు తీశాడు.