ఆఫీస‌ర్ టీజ‌ర్ పై వ‌ర్మ సంతోషం

RGV is Happy With Nagarjuna Officer 2 Teaser Response In YouTube

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నాగార్జున..రామ్ గోపాల్ వ‌ర్మ కాంబినేష‌న్ లో వస్తోన్న ఆఫీస‌ర్ పై భారీ అంచ‌నాలున్నాయి. టీజ‌ర్ల రిలీజ్ త‌ర్వాత‌..హైప్ మ‌రింత పెరిగింది. శుక్ర‌వారం విడుద‌ల‌యిన రెండో టీజ‌ర్ కు మంచి స్పంద‌న వచ్చింది. ఈ టీజ‌ర్ ప్ర‌స్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లో మూడో స్థానంలో ఉంది. టీజ‌ర్ కు ల‌భిస్తున్న ఆద‌ర‌ణ‌పై వ‌ర్మ ట్విట్ట‌ర్ లో ఆనందం వ్య‌క్తంచేశారు. త‌న‌కు నాగార్జున ఎప్పుడూ తీవ్ర‌మైన యాక్ష‌న్ హీరోగా క‌నిపిస్తార‌ని, టీజ‌ర్ 2లో ప్ర‌జ‌ల‌కు ఆయ‌న న‌చ్చ‌డం చాలా సంతోషంగా  ఉంద‌ని ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో మైరాశ‌రీన్ హీరోయిన్ గా ప‌రిచ‌యం కాబోతున్నార‌ని, ఇందులో ఆమె అద్భుతంగా న‌టించార‌ని, ఆమె తొలిసినిమా ఇదంటే ఎవ‌రూ న‌మ్మ‌లేర‌ని వ‌ర్మ కితాబిచ్చారు.

కంపెనీ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై వ‌ర్మ‌, సుధీర్ చంద్ర నిర్మించిన ఆఫీస‌ర్ ఈ నెల 25న విడుద‌ల కానుంది. మే 12న ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌నున్నారు. శ్రీరెడ్డి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ వివాదంలో వ‌ర్మపై ఆరోప‌ణ‌లు వ‌చ్చిన‌ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో..ఆఫీస‌ర్ రిలీజ్ పై తొలుత సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి. వ‌ర్మపై నిషేధం విధించాల‌న్న డిమాండ్లు కూడా మెగా కాంపౌండ్ నుంచి వినప‌డ‌డంతో…ఆఫీస‌ర్ విడుద‌ల గంద‌ర‌గోళంలో ప‌డుతుంద‌ని అంతా భావించారు. కానీ తెర‌వెనుక ఏం జ‌రిగిందో ఏమో కానీ…ఈ వివాదం గురించి ప్ర‌స్తుతం ఎవ‌రూ మాట్లాడ‌డం లేదు. దీంతో ఆఫీస‌ర్ సినిమాకూ ఎలాంటి అవాంత‌రాలూ ఎదురుకావ‌డం లేదు.