నాగచైతన్యను పెళ్లి చేసుకుంటా….సమంతకు షాక్‌ ఇచ్చిన రీతూ చౌదరి !

నాగచైతన్యను పెళ్లి చేసుకుంటా….సమంతకు షాక్‌ ఇచ్చిన రీతూ చౌదరి !
Latest News

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రిటీలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో చాలామంది బ్యాగ్రౌండ్ ఉపయోగించి ఇండస్ట్రీలోకి వస్తే… మరి కొంతమంది సోషల్ మీడియాను నమ్ముకుంటున్నారు. అచ్చం ఇలాగే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయి… ఆ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన వారిలో చాలా సెలబ్రిటీలు ఉన్నారు. అందులో ఒకరు రీతు చౌదరి.

నటి రీతు చౌదరి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మొదట్లో సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి… సీరియల్ లో కూడా నటించింది ఈ బ్యూటీ. అయితే జబర్దస్త్ షో లోకి వచ్చిన తర్వాత నటి రీతు చౌదరి క్రేజ్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే సినిమా అవకాశాలు కూడా ఈ బ్యూటీకి వస్తున్నాయట. ఇదిలా ఉండగా తాజాగా ఆలీ యాంకర్ గా చేస్తున్న ఆలీతో ఆల్ ఇన్ వన్ అనే గేమ్ షోకు రీతు చౌదరి వచ్చిందంట .

నాగచైతన్యను పెళ్లి చేసుకుంటా….సమంతకు షాక్‌ ఇచ్చిన రీతూ చౌదరి !
Samantha, Naga Chaitanya

నటి రీతు చౌదరితో పాటు స్రవంతి మరియు జెస్సి కూడా వచ్చేశారు. ఈ సందర్భంగా ఆలీ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్లు ఇచ్చింది నటి రీతి చౌదరి. ఈ సందర్భంగా నాగచైతన్య ను పెళ్లి చేసుకోవడానికి మాత్రమే ఇండస్ట్రీలోకి వచ్చానని నటి రీతు చౌదరి బాంబు పేల్చింది. రీతు చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలతో అక్కడ ఉన్న వారందరూ షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ షో సెప్టెంబర్ 26వ తేదీన రిలీజ్ కానుంది. అసలు రీతు చౌదరి ఆ వ్యాఖ్యలు ఎందుకు చెప్పిందో చూడాలంటే సెప్టెంబర్ 26వ తేదీ వరకు ఆగాల్సిందే.